హైదరాబాద్‌కు అమ్మోనియం నైట్రేట్ నిల్వలు

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్ రాజధాని బీరట్‌లో అమ్మోనియం నైట్రేట్(Ammonium nitrate) పేలుళ్ల  తర్వాత ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అన్ని దేశాల్లో వాటి నిల్వలు భారీగా ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అమ్మోనియం అతి ప్రమాదకరమైనది కావడంతో వాటి నిల్వలు, ట్రాన్స్ పోర్ట్ పై ప్రస్తుతం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. భారత్ లోనూ అమ్మోనియం నిల్వలు భారీగానే ఉన్నాయి. వాటి భద్రతపై ఇండియాలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ కేంద్ర ప్రభుత్వం […]

Update: 2020-08-11 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్ రాజధాని బీరట్‌లో అమ్మోనియం నైట్రేట్(Ammonium nitrate) పేలుళ్ల తర్వాత ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అన్ని దేశాల్లో వాటి నిల్వలు భారీగా ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అమ్మోనియం అతి ప్రమాదకరమైనది కావడంతో వాటి నిల్వలు, ట్రాన్స్ పోర్ట్ పై ప్రస్తుతం ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. భారత్ లోనూ అమ్మోనియం నిల్వలు భారీగానే ఉన్నాయి. వాటి భద్రతపై ఇండియాలోనూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

కాగా బీరుట్ పేలుళ్ల నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా చెన్నై ఫోర్ట్ లో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలను మంగళవారం హైదరాబాద్ కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎనిమిది కంటైనర్లలో తరలించినట్లు సాల్వో కంపెనీ పేర్కొంది. అమ్మోనియం నిల్వలను కీసరగుట్టలోని సాల్వో ఎక్స్ ప్లోజివ్ కంపెనీ(Salvo Explosive Company)లో నిల్వ చేసినట్టు వివరించారు. అక్కడ అమ్మోనియం నైట్రేట్ ను రీప్రాసెస్ చేసి కోల్ ఇండియా, సింగరేణి, నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags:    

Similar News