క్షమాపణలు చెప్పిన బిగ్ బీ..
మూడు వారాల పాటు కరోనాతో పోరాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. కరోనా నుంచి కోలుకొని ఇటీవలే ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కాగా, అమితాబ్‌కు తన తండ్రి కవితలంటే ఎంతో ఇష్టం. అందుకే తన తండ్రి రాసిన కవితలను తరచుగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి కూడా ‘అకెలెపాన్ కా బాల్’ అనే కవితను షేర్ చేశారు. ఆ కవితను తన తండ్రే […]
మూడు వారాల పాటు కరోనాతో పోరాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. కరోనా నుంచి కోలుకొని ఇటీవలే ముంబై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. కాగా, అమితాబ్‌కు తన తండ్రి కవితలంటే ఎంతో ఇష్టం. అందుకే తన తండ్రి రాసిన కవితలను తరచుగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి కూడా ‘అకెలెపాన్ కా బాల్’ అనే కవితను షేర్ చేశారు. ఆ కవితను తన తండ్రే రాశాడనుకుని పొరబడ్డాడు. అయితే, ఆ కవిత వాళ్ల నాన్న రాసింది కాదని తెలుసుకున్న బిగ్ బీ.. ట్విట్టర్ ద్వారా తన తప్పును మన్నించమంటూ వేడుకున్నాడు.
‘నిన్న నేను షేర్ చేసిన ‘అకెలెపాన్ కా బాల్’ పద్యం రాసింది మా నాన్న కాదు. దాన్ని ప్రసూన్ జోషి రాశారు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ ట్వీట్ చేయడంతో పాటు తన తండ్రి రాసిన మరో కవితను షేర్ చేశాడు బిగ్ బీ. ఇక బచ్చన్ చెప్పిన ప్రసూన్ జోషి.. కవి, గేయ రచయిత, స్క్రీన్ రైటర్ కూడా. ‘భాగ్ మిల్కా భాగ్, తారే జమీన్ పర్, చిట్టాగ్యాంగ్, ఢిల్లీ 6’ సినిమాలకు ఆయన కథను అందించాడు.
https://twitter.com/SrBachchan/status/1291238929782288386?s=20