అమిత్ షా అకౌంట్ లాక్ చేసిన ట్విట్టర్

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ అకౌంట్ గురువారం రాత్రి కొద్దిసేపు లాక్ చేసినట్టు ట్విట్టర్ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అమిత్ షా డిస్‌ప్లే పిక్ పై క్లిక్ చేస్తే “మీడియా ప్రదర్శించబడలేదు. కాపీరైట్ హోల్డర్ నుండి వచ్చిన నివేదికకు ప్రతిస్పందనగా ఈ చిత్రం తొలగించబడింది” అనే సందేశంతో ఖాళీ పేజీని చూపించింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ “అనుకోకుండా తలెత్తిన లోపం కారణంగా, మేము మా గ్లోబల్ కాపీరైట్ విధానాల […]

Update: 2020-11-13 03:58 GMT

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ అకౌంట్ గురువారం రాత్రి కొద్దిసేపు లాక్ చేసినట్టు ట్విట్టర్ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అమిత్ షా డిస్‌ప్లే పిక్ పై క్లిక్ చేస్తే “మీడియా ప్రదర్శించబడలేదు. కాపీరైట్ హోల్డర్ నుండి వచ్చిన నివేదికకు ప్రతిస్పందనగా ఈ చిత్రం తొలగించబడింది” అనే సందేశంతో ఖాళీ పేజీని చూపించింది.

దీనిపై స్పందించిన ట్విట్టర్ “అనుకోకుండా తలెత్తిన లోపం కారణంగా, మేము మా గ్లోబల్ కాపీరైట్ విధానాల క్రింద ఈ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసాము. కాసేపటికి అన్ లాక్ చేశాము. ఇప్పుడు అమిత్ షా ఖాతా పూర్తిగా పనిచేస్తుంది” అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. కాగా ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌లో షాకు 23.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

 

Tags:    

Similar News