కూటమి నేతలతో ‘మహా’ సీఎం మీటింగ్

ముంబయి: మహారాష్ట్రలో అధికారంలోని మహా వికాస్ అఘాడి కూటమిలో బీటలు పారాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రే కూటమి సభ్యులతో సమావేశమయ్యారు. కూటమి నేతల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు రాలేవని స్పష్టం చేస్తూ ఈ మీటింగ్ రోటీన్‌గా నిర్వహించేదేనని మంత్రి ఒకరు తెలిపారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వివరిస్తున్నట్టు కూటమిలో ఏ సమస్యా లేదని తెలుపుతూ మంత్రులతో సీఎం రెగ్యులర్‌గా నిర్వహించే మీటింగే ఇది అని వివరించారు. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీపీ […]

Update: 2020-05-27 03:38 GMT

ముంబయి: మహారాష్ట్రలో అధికారంలోని మహా వికాస్ అఘాడి కూటమిలో బీటలు పారాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ థాక్రే కూటమి సభ్యులతో సమావేశమయ్యారు. కూటమి నేతల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు రాలేవని స్పష్టం చేస్తూ ఈ మీటింగ్ రోటీన్‌గా నిర్వహించేదేనని మంత్రి ఒకరు తెలిపారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వివరిస్తున్నట్టు కూటమిలో ఏ సమస్యా లేదని తెలుపుతూ మంత్రులతో సీఎం రెగ్యులర్‌గా నిర్వహించే మీటింగే ఇది అని వివరించారు. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రేలతో వేర్వేరుగా వెంట వెంటనే భేటీ కావడం, ప్రభుత్వంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఆరోపణలకు తోడయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ సీనియర్ నేత గవర్నర్‌ను కోరడం, మహా వికాస్ అఘాడీలో అంతర్గతంగా అభిప్రాయభేదాలు ఏర్పడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి ఆరోపణలకు మంగళవారంనాటి సమావేశాలు, వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి.

Tags:    

Similar News