భారత్ కి వెళ్లొద్దు -అమెరికా 

దిశ, వెబ్ డెస్క్:  అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే  ప్రయాణ  మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది. మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్నివిదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో […]

Update: 2020-08-08 04:29 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది.

మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్నివిదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గని దేశాలకు మాత్రం ఆంక్షలు విధించింది.

Tags:    

Similar News