కరెన్సీ నోట్లపై ఆయన ఫోటో ముద్రించాలి.. పరశురామ్
దిశ, భువనగిరి: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించేలా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధ యాత్ర సోమవారం రోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం చేరుకుంది. ఈ పాదయాత్ర బృందానికి వివిధ సంఘాల నాయకులు ఘన […]
దిశ, భువనగిరి: కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించేలా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ డిమాండ్ చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధ యాత్ర సోమవారం రోజు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం చేరుకుంది. ఈ పాదయాత్ర బృందానికి వివిధ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పరశురామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదు, భారత రాజ్యాంగం లేకుంటే ఈ రాజ్యం లేదు అని అన్నారు.
అలాంటి మహానుభావుని ఈ ప్రభుత్వాలు మరిచిపోతున్నాయి అని అందుకోసమే ఈ పార్లమెంటు సమావేశాల్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని అని డిమాండ్ చేసారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, అంబేద్కర్ విగ్రహాలుకు సీసీ కెమెరాలు, హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, ముఖ ద్వారం వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఏపిఎస్ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, బి రవి, జోగు మురళి, బొల్లం లక్ష్మణ్, సురేష్, సందీప్, కె మచ్చగిరి, మధు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.