నిమ్మగడ్డ కేసు తీర్పుపై సుప్రీంకోర్టు కెళ్తాం : అంబటి

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజన్‌ను నియమిస్తూ ఓ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. దీంతో ఈ అంశంపై […]

Update: 2020-05-29 05:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్టు వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజన్‌ను నియమిస్తూ ఓ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. దీంతో ఈ అంశంపై ప్రతిపక్ష నేతలు హైకోర్టుకు వెళ్లారని, ఈ క్రమంలోనే హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు న్యాయం జరక్కపోవచ్చని, అటువంటి సమయాల్లో పై కోర్టుకు వెళ్లే అవకాశముంటుందని అంబటి రాంబాబు తెలిపారు. న్యాయ నిపుణులతో నిమ్మగడ్డ కేసుపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగం ప్రకారమే ఆర్డినెన్స్ తెచ్చామని, ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ పదవి కోల్పోయినట్టు అంబటి రాంబాబు వెల్లడించారు. కోర్టు తీర్పును పరిశీలించి అభ్యంతరాలను ఉంటే గనక పైకోర్టుకు అప్పీల్ చేయనున్నట్టు తెలిపారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు కోర్టు తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినట్టు అంబటి రాంబాబు ప్రస్తావించారు. ప్రభుత్వానికి ఉండే అధికారాలేమిటో తమకు తెలుసని, ప్రభుత్వానికుండే పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో కూడా తెలుసని, అలాగే మిగిలిన వ్యవస్థలకు పరిమితికి లోబడే అధికారాలుంటాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబడి అన్ని వ్యవస్థలు పని చేయాలని అంబటి రాంబాబు వెల్లడించారు.

Tags:    

Similar News