ఆ బాధ్యత బాబుదే: అంబటి రాంబాబు
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడదేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి పాలప్యాకెట్లు సరఫరా అవుతాయి కనుక అలాంటి చోట కరోనా సోకితే వ్యాధి విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని […]
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులు కరోనా బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడదేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి పాలప్యాకెట్లు సరఫరా అవుతాయి కనుక అలాంటి చోట కరోనా సోకితే వ్యాధి విస్తృతమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్రాలకి సలహాలు ఇచ్చే చంద్రబాబు, దీనిపై వివరణ ఇవ్వకపోతే ప్రజలు అయోమయానికి గురవుతారని ఆయన అన్నారు.
tags: ambati rambabu, ysrcp, tdp, chandrababu