నాపై ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా : అంబటి కృష్ణారెడ్డి

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై డీఎల్ చేసిన ఆరోపణలను రుజువు చేస్తే ఆత్మహత్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. డీఎల్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి డీఎల్ తనను విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు డీఎల్‌పై తనకు గౌరవం ఉండేదని కానీ నేటితో అది పోయిందన్నారు. మైదుకూరులో […]

Update: 2021-10-16 08:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై డీఎల్ చేసిన ఆరోపణలను రుజువు చేస్తే ఆత్మహత్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. డీఎల్ తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తి డీఎల్ తనను విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. నిన్నటి వరకు డీఎల్‌పై తనకు గౌరవం ఉండేదని కానీ నేటితో అది పోయిందన్నారు.

మైదుకూరులో భవిష్యత్‌లో డీఎల్ పోటీ చేస్తే అతడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు. తనకు రైతు అనుభవం లేదు అనడం ఆయన అనుభవ రాహిత్యమని విమర్శించారు. గతంలో డీఎల్ పోటీచేస్తే ఎన్నికల్లో తన వంతు ప్రచారం చేసి గెలిపించానని అలాంటిది తాను ఎవరో తెలియదని విమర్శించడం సిగ్గుచేటన్నారు. గతంలో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాని డీఎల్‌ను వైసీపీలోకి రావాలని ఎవరూ పిలవలేదన్నారు. గతంలో వైఎస్ ఫ్యామిలీ దెబ్బ ఏంటో రుచి చూశాడు.. మరోసారి చూపిస్తామంటూ హెచ్చరించారు. తాను రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా హంగు ఆర్భాటాలు లేకుండా పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాను ఈ పదవికి అనర్హుడు అంటే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. లేదంటే డీఎల్ ఏ శిక్ష వేసుకుంటారో చెప్పాలని నిలదీశారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ పల్లెలో , ఏ గ్రామాల్లో తిరిగావో చెప్పాలని..కనీసం ఒక్క రైతు సమస్య అయినా పరిష్కరించావా అంటూ ప్రశ్నించారు. ప్రతి నిమిషం, ప్రతి రోజు రైతుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనపై ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News