అంబానీని దాటేసిన చైనా బిలియనీర్!
దిశ, వెబ్‌డెస్క్: 2020 క్యాలెండర్ ఏడాదికి సంబంధించి అనూహ్యంగా చైనాకు చెందిన బిలీయనీర్ కొత్త ఆసియా కుబేరుడిగా అవతరించాడు. ఇటీవల 2020 క్యాలెండర్ ఏడాదికి ఆసియా సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచిన సంగతి తెలిసిందే. అనుకోకుండా ఏడాది చివరి రోజు ముఖేష్‌ని వెనక్కి నెట్టి చైనాకు చెందిన ఇండస్ట్రియలిస్ట్, చైనా ప్రైవేట్ బిలియనీర్ జోంగ్ షంషాన్ ఆసియా ధనవంతుడిగా స్థానం దక్కించుకున్నాడని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ తెలిపింది. 2020లో జోంగ్ షంషాన్ వ్యాక్సిన్ తయారీ […]
దిశ, వెబ్‌డెస్క్: 2020 క్యాలెండర్ ఏడాదికి సంబంధించి అనూహ్యంగా చైనాకు చెందిన బిలీయనీర్ కొత్త ఆసియా కుబేరుడిగా అవతరించాడు. ఇటీవల 2020 క్యాలెండర్ ఏడాదికి ఆసియా సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచిన సంగతి తెలిసిందే. అనుకోకుండా ఏడాది చివరి రోజు ముఖేష్‌ని వెనక్కి నెట్టి చైనాకు చెందిన ఇండస్ట్రియలిస్ట్, చైనా ప్రైవేట్ బిలియనీర్ జోంగ్ షంషాన్ ఆసియా ధనవంతుడిగా స్థానం దక్కించుకున్నాడని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ సూచీ తెలిపింది.
2020లో జోంగ్ షంషాన్ వ్యాక్సిన్ తయారీ కంపెనీ బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ 155 శాతం ర్యాలీ చేయగా, నోంగ్‌ఫు స్ప్రింగ్ వాటర్ బాటిల్‌డ్ కంపెనీ 2000 శాతంతో మార్కెట్లలో దుమ్మురేపాయి. దీంతో జాంగ్ షంషాన్ వ్యక్తిగత సంపద 77.8 బిలియన్ డాలర్లకు చేరడంతో ఆసియా అత్యంత సంపన్నుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ముఖేష్ వ్యక్తిగత సంపద 76.9 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో జాంగ్ 11వ స్థానం దక్కించుకున్నాడు. మరో ఆసియా సంపన్నుడు జాక్‌మా అక్టోబర్ నెల నుంచి తన ఆదాయంలో 11 బిలియన్ డాలర్లు కోల్పోయారు. దీంతో ఆయన సంపద 61.7 బిలియన్ డాలర్ల నుంచి 50.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది.