ఆసియా కుబేరులుగా నిలిచిన అంబానీ, అదానీ
దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపునకు చెందిన గౌతమ్ అదానీలు ఆసియా అత్యంత కుబేరులుగా నిలిచారు. తాజా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఉన్న చైనా కుబేరులను సైతం వీరిద్దరూ అధిగమించారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 84 బిలియన్ డాలర్లు(రూ.6 లక్షల కోట్లు పైగా) ఉండగా, గౌతమ్ అదానీ సంపద 78 బిలియన్ డాలర్లు(రూ. 5.6 లక్షల కోట్లు)కు చేరుకుంది. దీంతో ఇద్దరూ ఆసియా […]
దిశ, వెబ్‌డెస్క్: భారత దిగ్గజ పారిశ్రామికవేత్తలైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపునకు చెందిన గౌతమ్ అదానీలు ఆసియా అత్యంత కుబేరులుగా నిలిచారు. తాజా బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఉన్న చైనా కుబేరులను సైతం వీరిద్దరూ అధిగమించారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సంపద 84 బిలియన్ డాలర్లు(రూ.6 లక్షల కోట్లు పైగా) ఉండగా, గౌతమ్ అదానీ సంపద 78 బిలియన్ డాలర్లు(రూ. 5.6 లక్షల కోట్లు)కు చేరుకుంది.
దీంతో ఇద్దరూ ఆసియా అత్యంత సంపన్నులుగా అగ్రస్థానంలో ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. అలాగే, బ్లూమ్‌బెర్గ్ ప్రకారం ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 12వ స్థానం, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.