ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలోకి అమెజాన్
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19(kovid-19 ) సంక్షోభం, తర్వాతి పరిణామాల్లో లాక్‌డౌన్ (Lockdown) కారణాలతో ఆన్‌లైన్ ఫార్మసీ (Online Pharmacy)కి రంగానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కూడా ఆన్‌లైన్ ఫార్మాసీ (Online Pharmacy) విభాగంలో రానున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే, రిలయన్స్ (Reliance) కంటే ముందుగా ఈ రంగంలో అడుగుపెట్టేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (E-commerce giant Amazon) దీన్ని మొదలుపెట్టింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19(kovid-19 ) సంక్షోభం, తర్వాతి పరిణామాల్లో లాక్‌డౌన్ (Lockdown) కారణాలతో ఆన్‌లైన్ ఫార్మసీ (Online Pharmacy)కి రంగానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కూడా ఆన్‌లైన్ ఫార్మాసీ (Online Pharmacy) విభాగంలో రానున్నట్టు వార్తలు వినిపించాయి.
అయితే, రిలయన్స్ (Reliance) కంటే ముందుగా ఈ రంగంలో అడుగుపెట్టేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (E-commerce giant Amazon) దీన్ని మొదలుపెట్టింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సంస్థ వ్యాపారాభివృద్ధి (Business development) కోసం ఫార్మసీ (Pharmacy) రంగంలో అడుగుపెట్టడం అవసరమని అమెజాన్ ( Amazon) భావిస్తోంది. తద్వారా భారత్‌లో ఆన్‌లైన్‌లో మెడిసిన్(Medicine)తో పాటు సాధారణ వైద్య పరికరాలను డెలివరీ(Delivery) చేయనుంది.
అమెజాన్ ఫార్మసీ(Amazon Pharmacy) పేరుతో ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ చేయనున్నట్టు అమెజాన్ కంపెనీ (Amazon Company) ప్రకటించింది. ఇప్పటికే, ఈ సర్వీసులను బెంగళూరు (Bangalore)లో ప్రారంభించినట్టు, రానున్న తక్కువ కాలంలో మిగిలిన నగరాలకు విస్తరించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ప్రజావసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో అమెజాన్ ఫార్మసీ(Amazon Pharmacy) సౌకర్యాలను తీసుకొచ్చామని, దీనివల్ల కస్టమర్లకు సాధారణ వైద్య పరికరాలు, ఆయుర్వేద మందుల(Ayurvedic medicine)తో సహా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మెడిసిన్ అందజేయనున్నట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది.
కొవిడ్-19 (kovid-19 )వ్యాప్తి కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారని, ఈ నేపథ్యంలో తమ సేవలు వారికెంతో అవసరమని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఇటీవల కొవిడ్-19(kovid-19) వ్యాప్తి వల్ల ప్రజలు సాధారణ వ్యాధులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వైద్య సేవల రంగంలో అనేక మార్పులొచ్చాయి. డాక్టర్ల సలహాల మేరకు, చికిత్స(Treatment), పరీక్ష(Test), మెడిసిన్ (Medicine) సరఫరా లాంటి సేవలు ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారానే జరుపుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్ హెల్త్ మార్కెట్(Indian Digital Health Market) విలువ రూ. 33.7 వేల కోట్లుగా ఉన్నట్టు అంచనాలున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 4 రెట్లు అధికంగా ఉంది. దీంతో దేశంలో ఆన్‌లైన్ వైద్య సేవలు, మెడిసిన్ సరఫరా, వైద్య పరికరాలకు డిమాండ్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.