ఆమెజాన్ ప్రైమ్ ‘యూత్ ఆఫర్’.. 50శాతం తగ్గింపు

దిశ, ఫీచర్స్: అమెజాన్ ప్రైమ్ తమ ఇండియా యూజర్లకు మంత్లీ ప్రైమ్ సభ్యత్యాన్ని ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆపేసింది. అయితే తాజాగా ఇయర్లీ, క్వార్టర్లీ ప్రైమ్ ప్యాక్‌లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం సగం ధరకే వాటిని పొందే అవకాశాన్ని యూజర్లకు అందిస్తోంది. మరి ఆ ఆఫర్ పొందడానికి ఎవరు అర్హులు? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఆ విషయాలు మీకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం […]

Update: 2021-06-01 08:32 GMT

దిశ, ఫీచర్స్: అమెజాన్ ప్రైమ్ తమ ఇండియా యూజర్లకు మంత్లీ ప్రైమ్ సభ్యత్యాన్ని ఇటీవలే తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆపేసింది. అయితే తాజాగా ఇయర్లీ, క్వార్టర్లీ ప్రైమ్ ప్యాక్‌లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం సగం ధరకే వాటిని పొందే అవకాశాన్ని యూజర్లకు అందిస్తోంది. మరి ఆ ఆఫర్ పొందడానికి ఎవరు అర్హులు? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఆ విషయాలు మీకోసం

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతం మూడు నెలలకు రూ. 329, ఏడాదికి రూ. 999 వంటి రెండు ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, లేటెస్ట్‌గా ‘యాత్ ఆఫర్’ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ పొందటానికి , వినియోగదారులు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకుంటే ఆయా ఆఫర్ ప్యాక్‌లో ధరలో కేవలం 50 శాతానికి పొందవచ్చు. దీంతో పాటు ఈ-కామర్స్ ఆర్డర్‌ల‌కు ఉచిత, వేగవంతమైన డెలివరీ పొందవచ్చు. అమెజాన్ మ్యూజిక్, రీడింగ్ (ఈ-బుక్స్ కోసం) సేవలను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అయితే అమెజాన్ తన ప్రమోషనల్ ఆఫర్ ఎక్స్‌పైరీ డేట్ గురించి వెల్లడించలేదు. ఇలాంటి ఆఫర్స్ పరిమిత కాలానికి చెల్లుబాటు అవుతాయన్నది వినయోగదారులు దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకే అందుబాటులో ఉంది. అంతేకాదు మొబైల్ యాప్/బ్రౌజర్‌లో యాక్టివేట్ చేసుకున్న వారికి మాత్రమేనని అమెజాన్ పేర్కొంది. డెస్క్‌టాప్ / ఐవోఎస్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించదు.

ఫర్ ఆఫర్:

ఆఫర్ పొందటానికి, ఇప్పటికే ప్రైమ్ సభ్యత్వం లేని ఖాతా నుంచి అమెజాన్ ఇండియాకు సైన్ ఇన్ చేయండి (లేదా సైన్ అప్ చేయండి) లేదా ప్రీమియం సభ్యత్వ సేవకు ఇప్పటికే సభ్యత్వం ఉంటే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్ యాప్ నుంచి మీ ప్రైమ్ అమెజాన్ ఖాతాకు లాగిన్ కావాల్సి ఉంటుంది.
* సైన్ ఇన్ చేసిన తర్వాత, స్క్రీన్ లెఫ్ట్ సైడ్‌లోని స్లైడ్-అవుట్ మెనూని యాక్సెస్ చేసి, ప్రైమ్‌పై క్లిక్ చేయాలి.
* ఇక్కడ, సబ్‌స్క్రయిబ్‌పై ట్యాప్ చేయాలి. స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించండి.
* ప్రైమ్‌కు సభ్యత్వాన్ని పొందడానికి సంవత్సరానికి రూ. 999 రూపాయలు లేదా మూడు నెలలకు రూ .329 చెల్లించండి.
* సభ్యత్వం పొందిన తర్వాత, మీ యాప్‌లోని అమెజాన్ పే ట్యాబ్‌కు వెళ్లండి. అక్కడ యూజర్ తమ ఓటర్/ ఆధార్/ పాన్ కార్డ్/ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటితో పాటు సెల్ఫీని అప్‌లోడ్ చేయండి. ఇది మీ KYC (మీ కస్టమర్ తెలుసు) డాక్యుమెంటేషన్ వలె కూడా పని చేస్తుంది.
దీన్ని అనుసరించి, మీ గుర్తింపు, వయస్సు అమెజాన్ ఆటోమేటిక్‌గా ధ్రువీకరిస్తుంది. మీరు 18-24 వయస్సు పరిధిలోకి వస్తే, మీకు యూత్ ఆఫర్ తగ్గింపు లభిస్తుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన 48 గంటల్లో అమెజాన్ పే బ్యాలన్స్ కింద రూ .500 ((ఒకవేళ మీరు వన్ ఇయర్ సబ్‌స్కిప్షన్ తీసుకుంటే) జమ అవుతుంది. అదే మీరు మూడు నెలలు సభ్యత్వం తీసుకుంటే, రూ .165 క్యాష్‌బాక్ యాడ్ అవుతుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను రీచార్జులతో పాటు, ఇతర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే పొందటానికి చెల్లుతుంది.

Tags:    

Similar News