అమర్‌నాథ్ యాత్ర రద్దు!
న్యూఢిల్లీ : ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు అయింది. కరోనా విలయతాండవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ బోర్డు, జమ్ముకశ్మీర్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గతేడాది కూడా అమర్‌నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నందున అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని […]
న్యూఢిల్లీ : ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు అయింది. కరోనా విలయతాండవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ బోర్డు, జమ్ముకశ్మీర్ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గతేడాది కూడా అమర్‌నాథ్ యాత్ర మధ్యలోనే రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నందున అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే, భక్తులు లైవ్ టెలికాస్ట్‌లో తమ మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు. ఈ యాత్రపై సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరిష్ చంద్ర ముర్ము నేతృత్వంలో బోర్డు సభ్యులు, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో యాత్రను రద్దు చేయడమే సరైన నిర్ణయంగా వారు భావించారు.