బీజేపీతో సీట్ల పంపకంపై త్వరలోనే స్పష్టత : మాజీ సీఎం ప్రకటన

న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పంజాబ్ బీజేపీ ఇంచార్జి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటి అయ్యారు. ‘మా పొత్తు కుదిరింది. సీట్ల పంపకంపై ఇంకా చర్చ జరుగుతోంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో చూసి, సీట్ల ఎంపికకు ప్రమాణంగా గెలుపుని తీసుకుంటాం’ అని అన్నారు. అయితే బీజేపీకి దశాబ్దాలుగా మిత్ర పార్టీగా ఉన్న అకాళీదళ్, అమరీందర్ సింగ్ […]

Update: 2021-12-17 07:32 GMT

న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పంజాబ్ బీజేపీ ఇంచార్జి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటి అయ్యారు. ‘మా పొత్తు కుదిరింది. సీట్ల పంపకంపై ఇంకా చర్చ జరుగుతోంది. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో చూసి, సీట్ల ఎంపికకు ప్రమాణంగా గెలుపుని తీసుకుంటాం’ అని అన్నారు. అయితే బీజేపీకి దశాబ్దాలుగా మిత్ర పార్టీగా ఉన్న అకాళీదళ్, అమరీందర్ సింగ్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు కావాలని కోరినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా రెండు నెలల క్రితమే అమరీందర్ సీఎం పదవి నుంచి తప్పుకోగా, తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా వీడి సొంత పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News