కౌశిక్ రెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న లాంఛనంగా టీఆర్ఎస్‌లో చేరనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని పూర్తి ధీమాతో ఉన్నారు. ఇప్పటికే టికెట్ కన్‌ఫర్మ్ అయిందంటూ తన సన్నిహితులకు చెప్పుకుంటున్నారు. ఒక ఆడియో వైరల్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన కెరీర్ డామేజ్ అయిందంటూ హుజూరాబాద్‌లో బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అయినా టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ తనకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులకు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో ఒక […]
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నుంచి బహిష్కృతుడైన కౌశిక్‌రెడ్డి ఈ నెల 16న లాంఛనంగా టీఆర్ఎస్‌లో చేరనున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని పూర్తి ధీమాతో ఉన్నారు. ఇప్పటికే టికెట్ కన్‌ఫర్మ్ అయిందంటూ తన సన్నిహితులకు చెప్పుకుంటున్నారు. ఒక ఆడియో వైరల్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ఆయన కెరీర్ డామేజ్ అయిందంటూ హుజూరాబాద్‌లో బహిరంగంగానే చర్చలు జరుగుతున్నాయి. అయినా టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ తనకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులకు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్‌లో ఒక సెక్షన్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్‌లో గత ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డికి వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత అనుకూల పవనాలు ఉంటాయన్న అంచనాతో టికెట్ ఇవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతున్నది. వచ్చే నెల చివరికల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి ఈ నెల 16న పార్టీలో లాంఛనంగా చేరిన తర్వాత హుజూరాబాద్‌లోనే మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీఆర్ఎస్ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈలోగా హుజూరాబాద్‌లో ఇంతకాలం ఆయనతో సన్నిహితంగా మెలిగిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను సైతం టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కౌశిక్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించడం గమనార్హం.