థాంక్స్ స్విట్జర్లాండ్… మీ సంఘీభావం అమోఘం: బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. తన స్టైల్ తో భారత సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు. తన డ్యాన్స్ తో ఎంతో మంది హీరో, హీరోయిన్ల మనసు గెలుచుకున్నాడు. కానీ బన్నీ మనసు గెలుచుకుంది స్విట్జర్లాండ్ దేశం. కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్న భారతదేశానికి మద్దతు తెలుపుతూ, ఇందుకోసం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ … స్విస్ ఆల్ప్స్ లోని మేటర్ హార్న్ పర్వతం పై త్రివర్ణ పతాక కాంతులను ప్రదర్శించింది. తద్వారా భారత్ […]

Update: 2020-04-19 06:38 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. తన స్టైల్ తో భారత సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు. తన డ్యాన్స్ తో ఎంతో మంది హీరో, హీరోయిన్ల మనసు గెలుచుకున్నాడు. కానీ బన్నీ మనసు గెలుచుకుంది స్విట్జర్లాండ్ దేశం. కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్న భారతదేశానికి మద్దతు తెలుపుతూ, ఇందుకోసం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ … స్విస్ ఆల్ప్స్ లోని మేటర్ హార్న్ పర్వతం పై త్రివర్ణ పతాక కాంతులను ప్రదర్శించింది. తద్వారా భారత్ కు సంఘీభావం ప్రకటించింది. ఈ ఫోటోను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.

అయితే ఈ ఫోటోను చూసిన బన్నీ చాలా ఎక్సైట్ అయ్యాడు. ఆ దేశ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. థాంక్స్ స్విట్జర్లాండ్ … భారతదేశ పతాకాన్ని లేజర్ షో ద్వారా… మేటర్ హార్న్ పర్వతం పై ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. మువ్వన్నెల పతాకాన్ని మేటర్ హార్న్ పర్వతం పై చూస్తానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. మీరు భారత్ ను సపోర్ట్ చేసిన తీరు హృదయాలను హత్తుకుందని ట్వీట్ చేశారు బన్నీ.

కాగా బన్నీ .. సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సినిమా లో బన్నీ ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆకట్టుకోగా… బ్లాక్ బస్టర్ ఖాయమని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.

Tags :Allu Arjun, Switzerland, India, CoronaVirus Covid 19

Tags:    

Similar News