వారి సేవలు మరువలేనివి…

దిశ వెబ్ డెస్క్: అటవీ సంరక్షణ విధుల్లో భాగంగా ఎంతో మంది అధికారులు ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలోనూ ధైర్యంగా సిబ్బంది విధి […]

Update: 2020-09-11 04:53 GMT

దిశ వెబ్ డెస్క్:
అటవీ సంరక్షణ విధుల్లో భాగంగా ఎంతో మంది అధికారులు ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారని కొనియాడారు. కరోనా సమయంలోనూ ధైర్యంగా సిబ్బంది విధి నిర్వహణ చేస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. అయితే విధి నిర్వహణలో కరోనా బారిన పడి కొందరు అధికారులు మరణించడం విచారకరమని తెలిపారు.

అటవీ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే చట్టసవరణలు చేసి అటవీ నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News