లాసెట్ ​ఫస్ట్​ ఫేస్​ సీట్ల కేటాయింపు

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు గాను ఫస్ట్​ ఫేస్​ సీట్ల కేటాయింపు పూర్తయిందని ఉన్నత విద్యామండలి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. లాసెట్​ 2021లో భాగంగా కన్వనీనర్ ​కోటాలో 5339 మందికి సీట్ ​అలాట్​మెంట్ ​జరిగినట్లు లాసెట్ ​కన్వీనర్ ​రమేశ్​బాబు పేర్కొన్నారు. కాగా 966 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. మొత్తం 11180 మంది వెబ్​ఆప్షన్లు ఇచ్చుకున్నారని, అందులో మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 3375 మందికి, ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 1312 […]

Update: 2021-12-17 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాలకు గాను ఫస్ట్​ ఫేస్​ సీట్ల కేటాయింపు పూర్తయిందని ఉన్నత విద్యామండలి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. లాసెట్​ 2021లో భాగంగా కన్వనీనర్ ​కోటాలో 5339 మందికి సీట్ ​అలాట్​మెంట్ ​జరిగినట్లు లాసెట్ ​కన్వీనర్ ​రమేశ్​బాబు పేర్కొన్నారు. కాగా 966 సీట్లు మిగిలిపోయినట్లు తెలిపారు. మొత్తం 11180 మంది వెబ్​ఆప్షన్లు ఇచ్చుకున్నారని, అందులో మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 3375 మందికి, ఐదేళ్ల ఎల్ఎల్ బీ కోర్సులో 1312 మందికి, ఎల్ఎల్ఎం లో 652 మందికి సీట్ల కేటాయింపు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులు ఈనెల 18 నుంచి 23 మధ్య కాలేజీల్లో రిపోర్ట్​ చేయాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి వీరికి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News