కరోనా కష్టకాలంలో.. జర్నలిస్టులను అదుకుంటాం

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా ఆపత్కాలంలో జర్నలిస్టలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన 442 మంది జర్నలిస్టులకు రూ.80 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 257మంది జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున, రూ. 51 లక్షల 40 వేలు, హోం క్వారంటైన్‌లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున […]

Update: 2020-08-10 09:45 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: కరోనా ఆపత్కాలంలో జర్నలిస్టలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన 442 మంది జర్నలిస్టులకు రూ.80 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పాజిటివ్ వచ్చిన 257మంది జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున, రూ. 51 లక్షల 40 వేలు, హోం క్వారంటైన్‌లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున రూ.8 లక్షల 10 వేలు అందించామని తెలిపారు.

సోమవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా తాజగా మరో 101 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో ముగ్గురు జర్నలిస్టులు హోంక్వారంటైన్లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని తెలిపారు. ఈ 101 మంది జర్నలిస్టులకు రూ.20వేల చొప్పున రూ.20 లక్షల 20 వేలు, మ్ క్వారంటైన్లో ఉన్న ముగ్గురు జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున రూ.33వేల ఆర్థిక సాయాన్ని జర్నలిస్టుల ఆన్లైన్ అకౌంట్లో జమ చేసినట్టు తెలిపారు.

దీంతో మొత్తంగా అందరికీ రూ.80 లక్షల ఆర్థిక సహాయం అందిచినట్టు ఆయన తెలిపారు. జర్నలిస్టు మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్‌కు పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Tags:    

Similar News