మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..
దిశ, ముషీరాబాద్: జాతీయ స్థాయిలో గంగపుత్రులను ఏకం చేయడానికే అఖిల భారత గంగపుత్ర మహాసభ ఆవిర్భవించిందని మహాసభ అధ్యక్షుడు తౌడబోయిన సత్యం వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బెస్త తెగలు అధికంగా ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత గంగపుత్ర మహాసభ ఆవిర్భావ సమావేశం శుక్రవారం సుందరయ్య విజ్జాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షుడు తౌడబోయిన సత్యం […]
దిశ, ముషీరాబాద్: జాతీయ స్థాయిలో గంగపుత్రులను ఏకం చేయడానికే అఖిల భారత గంగపుత్ర మహాసభ ఆవిర్భవించిందని మహాసభ అధ్యక్షుడు తౌడబోయిన సత్యం వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో బెస్త తెగలు అధికంగా ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత గంగపుత్ర మహాసభ ఆవిర్భావ సమావేశం శుక్రవారం సుందరయ్య విజ్జాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షుడు తౌడబోయిన సత్యం మాట్లాడుతూ.. తెలంగాణలోనూ తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నామినేటెడ్ పదవులను తమకు కేటాయించాలని కోరారు.