మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్.. ఈసారి అంతకుమించి

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ చీరల పంపిణీ కి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2 నుంచి అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరలు ఈసారి 17 రంగులు.. 17 డిజైన్లతో మొత్తం కలిపి 289 వర్ణాలలో రూపొందించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చీరలు చేరుకున్నాయి. ఉప ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రాంతాలలో పంపిణీపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఏటా 300 కోట్లతో ప్రతి దాన్ని అమలు చేస్తుండగా ఈసారి.. అదనంగా […]

Update: 2021-09-29 00:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ చీరల పంపిణీ కి డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2 నుంచి అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరలు ఈసారి 17 రంగులు.. 17 డిజైన్లతో మొత్తం కలిపి 289 వర్ణాలలో రూపొందించారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలకు చీరలు చేరుకున్నాయి. ఉప ఎన్నికల దృష్ట్యా కొన్ని ప్రాంతాలలో పంపిణీపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రతి ఏటా 300 కోట్లతో ప్రతి దాన్ని అమలు చేస్తుండగా ఈసారి.. అదనంగా మరో 33 కోట్లు కేటాయించింది.

బతుకమ్మను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా పండుగ చేసుకోవడంతోపాటు, దశాబ్దాలుగా సరిపడా ఉపాధి లేని నేతన్నలకు చేతినిండా పని కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టింది. సర్కారు ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్దంగా పంపిణీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు, 18 ఏళ్లు నిండిన వారందరికి చీరలు అందజేస్తుంది. ప్రతి ఏటా 300 కోట్లకు పైగా చీరల పంపిణీ కేటాయిస్తుంది. ఈ ఏడాది అర్హులు సంఖ్య పెరగడంతో సూమారు కోటి 5 లక్షల చీరలును సిద్ధం చేసింది. ఇందుకోసం సూమారు 333 కోట్లు రూపాయలు మంజూరు చేసింది. తయారైన చీరలను అధికారులకు జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మహిళలకు అందజేయనున్నారు.

అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో అధికారులు అక్టోబర్ 2 నుంచి చీరలపంపిణీ కి అన్ని చర్యలు చేపట్టారు. టెస్కో ఆధ్వర్యంలో చీరలను లేటెస్టు డిజైన్లు, మంచి క్వాలిటీతో తయారు చేశారు. అయితే బీసీ వెల్ఫేర్ శాఖ, రెవెన్యూ అధికారులు చీరల తయారీని పర్యవేక్షణ చేశారు. ఈ డిజైన్ల నుంచి మహిళా ఉన్నతాధికారులు, ఇతర అధికారిణులు పలు చీరలను ఎంపిక చేశారు. మహిళల అభిరుచి మేరకు ఈ బతుకమ్మ చీరల డిజైన్ ఎంపిక జరిగింది. పండగ రోజు మహిళలంతా ఒకే విధంగా కన్పించకుండా సుమారుగా 17 పైగా డిజైన్లు, 17 కలర్స్ లో ఈ చీరలు తయారు అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వస్త్రాల నాణ్యత, తయారీ, ప్రింటింగ్, కొంగు, బార్డర్లు, ప్యాకేజీంగ్ వంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించగా, గ్రామ కార్యదర్శులు, రేషన్‌షాప్‌ డీలర్లు, సెర్ప్, మెప్మా మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో లబ్ధిదారులకు అందజేస్తారు.

బతుకమ్మ చీరలను ఆకర్షణీయమైన రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో, నూరు శాతం పాలిస్టర్‌ ఫిలమెంట్‌ నూలుతో తయారు చేశారు. వృద్ధ మహిళల కోం 6.3 మీటర్లు, ఇతరులకు 5.5 మీటర్ల చీరలను తయారు చేశారు. చీరలోనే బ్లౌజ్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ 1న రానుండడంతో కొన్ని మండలాల్లో చీరల పంపిణీ పై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News