బాలీవుడ్ మ్యారేజ్ @ 2021..
బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ లిస్ట్‌లో ‘రణబీర్ కపూర్ – అలియా భట్, వరుణ్ ధావన్ – నటాషా దలాల్’ జంటలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కానీ, వీరి పెళ్లికి మాత్రం 2020లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం వారు మరో ఏడాదిపాటు వేచి ఉండక తప్పదని సమాచారం. కొన్నేళ్లుగా నటాషాతో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్.. 2020లో పెళ్లిపీటలు ఎక్కేద్దామనే ప్లాన్‌లో ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా వివాహాన్ని వాయిదా వేయడమే సరైందనే నిర్ణయానికొచ్చాడంట వరుణ్. రెండు కుటుంబాలు […]
బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్ లిస్ట్‌లో ‘రణబీర్ కపూర్ – అలియా భట్, వరుణ్ ధావన్ – నటాషా దలాల్’ జంటలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. కానీ, వీరి పెళ్లికి మాత్రం 2020లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇందుకోసం వారు మరో ఏడాదిపాటు వేచి ఉండక తప్పదని సమాచారం.
కొన్నేళ్లుగా నటాషాతో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్.. 2020లో పెళ్లిపీటలు ఎక్కేద్దామనే ప్లాన్‌లో ఉన్నప్పటికీ.. కరోనా పరిస్థితుల కారణంగా వివాహాన్ని వాయిదా వేయడమే సరైందనే నిర్ణయానికొచ్చాడంట వరుణ్. రెండు కుటుంబాలు కూడా ఇదే నిర్ణయానికి ఓటేయగా.. మ్యారేజ్ 2021కి పోస్ట్‌పోన్ అయిందని సన్నిహితవర్గాలు వెల్లడించాయి.
ఇక రణబీర్ విషయానికి వస్తే.. ఈయన గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దది. ‘సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్’తో బ్రేకప్ తర్వాత ప్రస్తుతం అలియా భట్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నాడు. ఈ ఏడాది పెళ్లి చేసుకుని రిలేషన్‌ను అఫీషియల్ చేద్దామనుకున్నారు. కానీ, రణబీర్ తండ్రి రిషి కపూర్ మరణంతో ఈ ఏడాది వీరిద్దరి వివాహం జరిగే చాన్స్ లేదు. అంటే 2021 సెకెండ్ హాఫ్‌లోనే వీరికి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.