Alia Bhatt : గుర్తుంచుకోండి.. కరోనాపై పోరాడగలం : ఆలియా
దిశ, సినిమా: ‘సైన్స్ వ్యాక్సిన్‌ను అందించింది.. వ్యాక్సిన్ కరోనాపై పోరాడే నమ్మకాన్ని ఇస్తుంది’ అని వివరించింది బ్యూటిఫుల్ ఆలియా భట్.(Alia Bhatt). సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి స్ప్రెడ్ అవుతున్న మిస్ఇన్ఫర్మేషన్, రూమర్స్ నమ్మకూడదని సూచించిన ఆమె.. కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడం అనేది పర్సనల్ చాయిస్ అని తెలిపింది. అయితే ఈ టీకా తీసుకోవడం వలన కలిగే లాభాన్ని వివరించేందుకు ఆడియోమాటిక్తో కలిసి గ్లోబల్ హెల్త్ యాక్టివిస్ట్స్, డాక్టర్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నానని తెలిపింది. ఐదు […]
దిశ, సినిమా: ‘సైన్స్ వ్యాక్సిన్‌ను అందించింది.. వ్యాక్సిన్ కరోనాపై పోరాడే నమ్మకాన్ని ఇస్తుంది’ అని వివరించింది బ్యూటిఫుల్ ఆలియా భట్.(Alia Bhatt). సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి స్ప్రెడ్ అవుతున్న మిస్ఇన్ఫర్మేషన్, రూమర్స్ నమ్మకూడదని సూచించిన ఆమె.. కొవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకోవడం అనేది పర్సనల్ చాయిస్ అని తెలిపింది. అయితే ఈ టీకా తీసుకోవడం వలన కలిగే లాభాన్ని వివరించేందుకు ఆడియోమాటిక్తో కలిసి గ్లోబల్ హెల్త్ యాక్టివిస్ట్స్, డాక్టర్స్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నానని తెలిపింది. ఐదు సిరీస్‌ల పాడ్‌కాస్ట్‌లో వ్యాక్సిన్ గురించి ఫ్యాక్ట్స్ వివరించనున్నారని, వ్యాక్సిన్ గురించి నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ సిరీస్ సాయపడుతుందని చెప్పింది. కరోనాపై పోరాడగలమని గుర్తుంచుకోవాలన్న ఆలియా.. నిపుణులు వివరించే విషయాలను బంధుమిత్రులతో పంచుకోవాలని సూచించింది.
Shared knowledge is our greatest ally in this fight against Covid-19.
Together, @audiomaticIN and @EternalSunProd are bringing to you a 5 part series that can help us understand the Covid-19 vaccines a little better. pic.twitter.com/VxoKg4GsF0— Alia Bhatt (@aliaa08) May 26, 2021