మంచి నీటి నల్లా నుంచి మద్యం
ఇంట్లో ఉన్న నల్లాల నుంచి మద్యం వస్తుండటంతో కేరళలోని త్రిస్సూర్ జిల్లా సోలోమన్ అవెన్యూలో నివసించే కుటుంబీకులు షాక్‌కి గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు చెక్ చేసుకున్న తర్వాత మొత్తం 18 ఇళ్లలో నల్లాల నుంచి ఆల్కహాల్ కలిపిన నీళ్లు వస్తున్నాయని తేలింది. దీనికి సంబంధించి విచారణ చేయగా ఎక్సైజ్ శాఖ వారు చేసిన ఓ పని విఫలమవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇంతకీ ఏం జరిగింది? […]
ఇంట్లో ఉన్న నల్లాల నుంచి మద్యం వస్తుండటంతో కేరళలోని త్రిస్సూర్ జిల్లా సోలోమన్ అవెన్యూలో నివసించే కుటుంబీకులు షాక్‌కి గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరు చెక్ చేసుకున్న తర్వాత మొత్తం 18 ఇళ్లలో నల్లాల నుంచి ఆల్కహాల్ కలిపిన నీళ్లు వస్తున్నాయని తేలింది. దీనికి సంబంధించి విచారణ చేయగా ఎక్సైజ్ శాఖ వారు చేసిన ఓ పని విఫలమవడమే ఇందుకు కారణమని తెలిసింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఆ ప్రాంతంలో రచన అనే బార్లో అక్రమంగా 6000 లీటర్ల మద్యం దాచి ఉంచారని, దాన్ని స్వాధీనం చేసుకుని నాశనం చేయాలని కోర్టు, ఎక్సైజ్ పోలీసులను ఆదేశించింది. ఆ పనిలో భాగంగా ఆరు గంటల పాటు కష్టపడి మద్యం మొత్తం పారబోశారు. అయితే వాళ్లు ఆ మద్యాన్ని, బిల్డింగ్ పక్కనే ఒక పెద్ద గొయ్యి తీసి ఒక్కొక్క బాటిల్ తెరిచి, అందులో పారబోశారు. కానీ ఆ గొయ్యిలో ఇంకిన మద్యం సరాసరి సోలోమన్ అవెన్యూ వారికి మంచినీళ్లు సరఫరా చేసే బావి నీళ్లలో కలిసింది. దీంతో మంచినీళ్ల నల్లాలు కాస్త మద్యం పంచే నల్లాలుగా మారిపోయాయి.