భజ్జీని మ్యాచ్ టికెట్లు అడిగిన అక్తర్

దిశ, స్పోర్ట్స్ :టీమ్ ఇండియా రెండో సారి వన్డే వరల్డ్ గెలిచి 10 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాడు జట్టులో ఉన్న క్రికెటర్లు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇండియా ఫైనల్ చేరుకోవడానికి సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై గెలిచింది. వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ టీమ్ ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ దగ్గరకు వచ్చి ఫైనల్ మ్యాచ్ టికెట్లు అడిగాడట. ‘ఫైనల్ టికెట్స్‌తో నీకేం పని… అక్కడ ఆడేది ఇండియా-పాకిస్తాన్ కాదు […]

Update: 2021-04-03 10:27 GMT

దిశ, స్పోర్ట్స్ :టీమ్ ఇండియా రెండో సారి వన్డే వరల్డ్ గెలిచి 10 ఏళ్లు అయిన సందర్భంగా ఆనాడు జట్టులో ఉన్న క్రికెటర్లు తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇండియా ఫైనల్ చేరుకోవడానికి సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై గెలిచింది. వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ టీమ్ ఇండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ దగ్గరకు వచ్చి ఫైనల్ మ్యాచ్ టికెట్లు అడిగాడట.

‘ఫైనల్ టికెట్స్‌తో నీకేం పని… అక్కడ ఆడేది ఇండియా-పాకిస్తాన్ కాదు కదా. ఒక వేళ నువ్వు స్వయంగా మ్యాచ్ చూస్తానంటే ఒక మూడు నాలుగు టికెట్లు ఇప్పిస్తా’ అని చెప్పినట్లు భజ్జీ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే మొహలీ వేదికగా ఇండియాతో జరిగిన సెమీస్‌లో కూడా అక్తర్ ఆడలేదు. ఆ రోజు కలిసి ఉంటే మ్యాచ్ టికెట్లు ఇద్దామని భావించానని.. కానీ అక్తర్ కలవలేదని భజ్జీ చెప్పాడు.

Tags:    

Similar News