ఆకులపై కేరళ యువకుడి అద్భుత చిత్రాలు..

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ వల్ల అందరికీ ఇల్లే ప్రపంచంగా మారిపోయింది. అప్పటివరకు ఉపాధి, ఉద్యోగాల కోసం ఉరుకుల పరుగుల జీవితాలు గడిపిన వారందరికీ కాస్త విశ్రాంతి దొరికింది. వాళ్ల లైఫ్‌ను ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకునే అవకాశాన్ని ప్రకృతే వారికి కల్పించింది. అలా చాలా మంది ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులను, తమ ప్రతిభను, అలవాట్లను మరోసారి తమ జీవితంలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన 28 ఏళ్ల అఖిల్ రాజ్.. తనలోని కళకు మెరుగులు […]

Update: 2020-11-23 04:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ వల్ల అందరికీ ఇల్లే ప్రపంచంగా మారిపోయింది. అప్పటివరకు ఉపాధి, ఉద్యోగాల కోసం ఉరుకుల పరుగుల జీవితాలు గడిపిన వారందరికీ కాస్త విశ్రాంతి దొరికింది. వాళ్ల లైఫ్‌ను ఒక్కసారి తిరిగి వెనక్కి చూసుకునే అవకాశాన్ని ప్రకృతే వారికి కల్పించింది. అలా చాలా మంది ఎన్నో రోజులుగా చేయాలనుకుంటున్న పనులను, తమ ప్రతిభను, అలవాట్లను మరోసారి తమ జీవితంలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన 28 ఏళ్ల అఖిల్ రాజ్.. తనలోని కళకు మెరుగులు దిద్దుకున్నాడు. అలా ‘లీఫ్ ఆర్ట్’తో సరికొత్త ఉపాధిని సృష్టించుకుని, మంచి ఆదాయాన్ని అందుకుంటున్నాడు.

కేరళ, వాయనాడ్‌లో నివసించే అఖిల్ రాజ్.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ముంబైలో ఉద్యోగం పొందాడు. ఆ తర్వాత యూకేకు చెందిన క్రూయిజ్ కంపెనీలో జాబ్ రావడంతో నాలుగేళ్ల క్రితం యూకే వెళ్లాడు. 2019, నవంబర్‌లో కేరళకు వచ్చిన అఖిల్.. లాక్‌డౌన్ కారణంగా ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దాంతో అందరిలానే తను కూడా సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాడు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోల్లో ‘లీఫ్ ఆర్ట్’ను చూసిన అఖిల్.. తను కూడా ట్రై చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో జాక్‌ఫ్రూట్ ఆకుల మీద ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత రావి చెట్టు ఆకుల మీద కార్వింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా మెల్లగా మొదలైన తన ఆర్ట్ స్కిల్స్‌తో సెలెబ్రిటీల పొట్రెయిట్ వేసే స్థాయికి చేరడంతో అభినందనలు వెల్లువెత్తాయి. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సెలెబ్రిటీల ఫొటోలు చూసిన చాలామంది తమకు కూడా అలాంటివి కార్వింగ్ చేయాలంటూ పలు ఆర్డర్స్ రావడంతో.. క్రమంగా అది బిజినెస్‌గా మారింది. ఇప్పుడు సింగిల్ పొట్రెయిట్‌కు రూ. 900, కపుల్ పొట్రెయిట్‌కు రూ. 1700 చార్జ్ చేస్తున్న అఖిల్.. లీఫ్ ఆర్ట్ ద్వారా నెలకు రూ. 25వేల పైనే సంపాదిస్తున్నాడు.

ఒక్కో లీఫ్ ఆర్ట్ వేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుందని అఖిల్ తెలిపాడు. ఆకు మీద ఆర్ట్ వేసి, తర్వాత దాన్ని ఎండబెడతాడు. ఆకుకు ఫంగస్ దరిచేరకుండా పాలిష్ అప్లయ్ చేసి, దాన్ని ఫ్రేమ్‌లో ఫిక్స్ చేస్తాడు. ఇలా ఆర్ట్ నుంచి ఫ్రేమింగ్ వరకు పూర్తి కావడానికి మొత్తంగా వారం నుంచి పదిరోజులవుతుందని అఖిల్ పేర్కొన్నాడు. ఇక గంట టైమ్‌లో 25 ఇంటర్నేషనల్ కార్ల బ్రాండ్ లోగోస్ లీఫ్ ఆర్ట్ చేయడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నాడు.

 

Tags:    

Similar News