ఆర్థిక వ్యవహారాల కొత్త కార్యదర్శిగా అజయ్ సేఠ్!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో ఆర్థిక వ్యవహారాల కొత్త కార్యదర్శిగా అజయ్ సేఠ్‌ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అజయ్ సేఠ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈ నెల 6న తరుణ్ బజాజ్ స్థానంలో 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేఠ్‌ను నియమిస్తూ కేంద్ర కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల ఆర్థికవ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో అజయ్ సేఠ్‌ ఆర్థిక […]

Update: 2021-04-16 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న క్రమంలో ఆర్థిక వ్యవహారాల కొత్త కార్యదర్శిగా అజయ్ సేఠ్‌ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. అజయ్ సేఠ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. ఈ నెల 6న తరుణ్ బజాజ్ స్థానంలో 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అజయ్ సేఠ్‌ను నియమిస్తూ కేంద్ర కేబినేట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ వల్ల ఆర్థికవ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో అజయ్ సేఠ్‌ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించడం విశేషం. అజయ్ సేఠ్‌ 2018, జూలై నుంచి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 2000-2004 మధ్య ఆర్థిక శాఖ వ్యయాలు, ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్‌గా చేశారు. అంతేకాకుండా పన్ను విభాగంలోనూ చేసిన అనుభవం అజయ్ సేఠ్‌కు ఉంది. కాగా, ఇప్పటివరకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా చేసిన తరుణ్ బజాజ్‌ను రెవెన్యూ విభాగం కార్యదర్శిగా బదిలీ కాబడ్డారు.

Tags:    

Similar News