'హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు అందుకే అవకాశం రాలేదు'

దిశ వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం రాకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతూ గత కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ట్వీట్ చేసినా… బీసీసీఐ పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వకపోడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై జరుగుతున్న రగడపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందించాడు. కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారని, […]

Update: 2021-03-09 22:35 GMT

దిశ వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం రాకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని కోరుతూ గత కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ట్వీట్ చేసినా… బీసీసీఐ పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహణకు అవకాశం ఇవ్వకపోడంపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై జరుగుతున్న రగడపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ స్పందించాడు. కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారని, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐని కోరామన్నాడు. సౌత్‌లో రెండు వేదికలు ఉండటంతో.. హైదరాబాద్‌లో మ్యాచ్‌ల నిర్వహణ లేదని నిర్ణయం తీసుకున్నారన్నాడు.

పాత అసోసియేషన్ ట్యాక్స్‌లు తామే చెల్లించామని, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అజారుద్దీన్ తెలిపాడు. అసోసియేషన్‌పై బయట జరుగుతున్న చర్చలు అవాస్తవమన్నాడు.

Tags:    

Similar News