ఇటుకబట్టి కూలీలను ఆదుకోవాలి

దిశ, రంగారెడ్డి: ఇటుక బట్టి కూలీలను ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య కలెక్టర్‌ అమోయ్ కుమార్‌ను కోరారు. ఇసుక బట్టిలను పరిశీలించిన ఏఐటీయూసీ నాయకులు.. లాక్‌డౌన్ సమయంలో కూడా యజమానులు కార్మికులచే నిరంతరం పనిచేయిస్తున్నారని జీ-మెయిల్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమానుల స్వార్థ ప్రయోజనాల ద్వారా కార్మికులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. పనిచేయని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వారికి సరైన […]

Update: 2020-04-01 07:29 GMT

దిశ, రంగారెడ్డి: ఇటుక బట్టి కూలీలను ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య కలెక్టర్‌ అమోయ్ కుమార్‌ను కోరారు. ఇసుక బట్టిలను పరిశీలించిన ఏఐటీయూసీ నాయకులు.. లాక్‌డౌన్ సమయంలో కూడా యజమానులు కార్మికులచే నిరంతరం పనిచేయిస్తున్నారని జీ-మెయిల్ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమానుల స్వార్థ ప్రయోజనాల ద్వారా కార్మికులు వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. పనిచేయని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని నాయకులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వారికి సరైన సదుపాయాలు, వసతి కల్పించడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీ కూలీలను ఆదుకోవాలని కలెక్టర్‌ అమోయ్ కుమార్‌ను కోరారు.

Tags: AITUC,massage, collector, help, Brick-making workers, rangareddy

Tags:    

Similar News