పబ్లిక్‌గా కిస్ చేసుకోవడంపై ఐశ్వర్య రాయ్..
దిశ, సినిమా: ఓఫ్రా విన్‌ఫ్రే సెలెబ్రిటీ చాట్ షో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయింది. ఒక స్టార్.. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారంటే గొప్ప విషయంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రా ఈ షోకు గెస్ట్‌గా హాజరుకానుండగా.. గతంలో ఈ షోకు హాజరైన ఐశ్వర్య రాయ్ భారత్ గొప్పతనాన్ని వివరించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా షోలో సెక్సువాలిటీ, పబ్లిక్ కిస్, అరేంజ్డ్ మ్యారేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్కిన్ కలర్, ఇండియాలో అమెరికన్ మహిళల […]
దిశ, సినిమా: ఓఫ్రా విన్‌ఫ్రే సెలెబ్రిటీ చాట్ షో వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయింది. ఒక స్టార్.. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారంటే గొప్ప విషయంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రా ఈ షోకు గెస్ట్‌గా హాజరుకానుండగా.. గతంలో ఈ షోకు హాజరైన ఐశ్వర్య రాయ్ భారత్ గొప్పతనాన్ని వివరించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా షోలో సెక్సువాలిటీ, పబ్లిక్ కిస్, అరేంజ్డ్ మ్యారేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్కిన్ కలర్, ఇండియాలో అమెరికన్ మహిళల పట్ల అవగాహన వంటి అంశాలపై నేర్పుగా సమాధానమిచ్చింది ఐశ్వర్య.
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం గురించి ఓఫ్రా విన్‌ఫ్రే ప్రశ్నించగా.. ‘ఇది నిజంగా తెలిసిన దృశ్యం కాదు. ఇండియాలో ప్రజలు ముద్దుపెట్టుకుంటారు కానీ, ఏ వీధి మూలనో జరగదు. ఇది మరింత గోప్యమైన భావవ్యక్తీకరణ. కళ అనేది జీవితాన్ని అనుకరిస్తుంది, అది సినిమాల్లో కనిపిస్తుంది’ అని సమాధానమిచ్చింది. ఓఫ్రా ‘సెక్స్.. అవుట్ ఆఫ్ మ్యారేజ్’ నిషిద్ధమా అని అడగ్గా, ‘నిజం చెప్పాలంటే ఇది మంచి పని కాదు’ అని తెలిపింది ఐశ్వర్య. అంతేకాదు విదేశాల్లో చదువుకుంటేనే ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడగలమన్న ప్రజల భావన నిజంగా షాక్‌కు గురిచేస్తుందని చెప్పింది ఐశ్వర్య. ముప్పై ఏళ్లు వచ్చేసరికి యూఎస్‌లో పేరెంట్స్ తమ పిల్లలను బయటకు నెట్టేస్తారు కానీ ఇండియాలో అలా కాదు. ఇది కుటుంబానికి, వారి మధ్య ఉండే ప్రేమలకు మధ్య విషయమని తెలిపింది. ఇది బహుశా భారతదేశం యొక్క గొప్పతనం కావొచ్చని చెప్పింది. ఇక అర్బన్ ఇండియాలో అరేంజ్డ్ మ్యారేజెస్ గ్లోబల్ డేటింగ్ సర్వీస్‌ను పోలి ఉంటాయని వివరించింది ఐశ్వర్య. అమ్మాయి, అబ్బాయికి చెందిన కుటుంబాలు.. వారి బ్యాక్‌గ్రౌండ్ స్టడీ చేసి ఇద్దరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి నిశ్చితార్థం చేస్తారని, తర్వాత ఇద్దరూ కలిసి డేటింగ్ చేశాక వర్కౌట్ అయితే పెళ్లి ఉంటుందని తెలిపింది.