ఎయిర్‌టెల్ vs వొడాఫోన్ vs జియో.. ఏది ఎంతంటే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దారిలోనే రిలయన్స్ జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్ ప్లాన్‌ల ధరలను మెుదట ఎయిర్‌టెల్ పెంచగా వొడాఫోన్ ఐడియా, జియో కూడా అదే బాటలో నడుస్తూ తమ టారీఫ్ ఛార్జీలను పెంచాయి. దాదాపు అన్ని కంపెనీలు 20 శాతం మేర ఛార్జీలను పెంచుతూ కొత్త ప్లాన్ల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఛార్జీలు నవంబర్ 26 […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దారిలోనే రిలయన్స్ జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్ ప్లాన్‌ల ధరలను మెుదట ఎయిర్‌టెల్ పెంచగా వొడాఫోన్ ఐడియా, జియో కూడా అదే బాటలో నడుస్తూ తమ టారీఫ్ ఛార్జీలను పెంచాయి. దాదాపు అన్ని కంపెనీలు 20 శాతం మేర ఛార్జీలను పెంచుతూ కొత్త ప్లాన్ల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ఛార్జీలు నవంబర్ 26 నుంచి, వొడాఫోన్ ఐడియా 25 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక రిలయన్స్ జియో ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
వినియోగదారునికి సగటు ఆదాయాన్ని (ARPU) మెరుగుపరచడం, స్థిరమైన టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడం లక్ష్యంగా టారిఫ్‌ల పెంపుదల ఉందని టెలికాం ఆపరేటర్లు ప్రకటించారు. దీంతో వినియోగదారులు ఏ కంపెనీ ఉత్తమ ప్లాన్‌లను అందిస్తుందో తెలియక సతమతమవుతున్నారు. అందుకోసం వారు తమ టారిఫ్ ప్లాన్‌లను నిర్ణయించుకోడానికి మూడు టెలికాం ఆపరేటర్లు అందించే ప్లాన్‌లు మీకోసం.