స్టార్టప్, చిన్న కంపెనీలకు ‘ఎయిర్‌టెల్’ బంపర్ ఆఫర్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం నెట్‌వర్క్ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దిగ్గజ ఐటీ సంస్థలు గూగుల్ క్లౌడ్, సిస్కో్‌ల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవల కోసం ‘ఎయిర్‌టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ను గురువారం ప్రారంభించింది. ఇటీవల అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపారాల వారికోసంతో పాటు టెక్నాలజీ విభాగంలోని స్టార్టప్ కంపెనీలకు డిజిటల్ కనెక్టివిటీ అవసరాలు తీర్చేందుకు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించినట్టు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ కొత్త ఆఫీస్ ఇంటర్నెట్ […]

Update: 2021-08-05 11:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం నెట్‌వర్క్ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ దిగ్గజ ఐటీ సంస్థలు గూగుల్ క్లౌడ్, సిస్కో్‌ల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవల కోసం ‘ఎయిర్‌టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ను గురువారం ప్రారంభించింది. ఇటీవల అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపారాల వారికోసంతో పాటు టెక్నాలజీ విభాగంలోని స్టార్టప్ కంపెనీలకు డిజిటల్ కనెక్టివిటీ అవసరాలు తీర్చేందుకు ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రారంభించినట్టు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ కొత్త ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లు రూ. 999 నుంచి మొదలవనున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా పలు యాడ్-ఆన్ సేవలు పొందవచ్చని కంపెనీ పేర్కొంది. చిన్న వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లు డిజిటల్ విధానంలో ఎదిగేందుకు తమ కొత్త ప్లాన్ ఎంతో ఉపయోగపడుతుందని భారతీ ఎయిర్‌టెల్ చైర్మెన్ సునీల్ మిటల్ అన్నారు. ఎయిర్‌టెల్ ఆఫీ ఇంటర్నెట్ ద్వారా కంపెనీలకు అపరిమిత కాలింగ్, 1జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎయిర్‌టెల్ అందిస్తుంది. వర్క్‌స్పేస్ లైసెన్స్ సహా ఇతర సేవలను కల్పించనుంది. వైరస్, సైబర్ దాడుల నుంచి కంపెనీలను భద్రత ఇచ్చేందుకు సిస్కో, కాస్పర్‌స్కై సంస్థలు సహాయం చేయనున్నాయని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News