తేదీ, సమయంలో మార్పులకు రుసుము ఉండదు : ఎయిర్ఏషియా

దిశ, వెబ్‌డెస్క్: మే 15వ తేదీ వరకూ బుకింగ్ చేసుకున్న టికెట్ల విషయంలో సమయం, తేదీని మార్చుకోవడానికి ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని ఎయిర్‌ ఏషియా ఇండియా ఆదివారం ప్రకటించింది. టికెట్లను బుక్ చేసుకున్న అనంతరం అనుకోని పరిస్థితుల కారణంగా సమయం, తేదీని మార్చుకుంటే గనక విమానయాన కంపెనీలు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విపరీతంగా ఉండటంతో పలు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే […]

Update: 2021-04-18 08:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: మే 15వ తేదీ వరకూ బుకింగ్ చేసుకున్న టికెట్ల విషయంలో సమయం, తేదీని మార్చుకోవడానికి ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని ఎయిర్‌ ఏషియా ఇండియా ఆదివారం ప్రకటించింది. టికెట్లను బుక్ చేసుకున్న అనంతరం అనుకోని పరిస్థితుల కారణంగా సమయం, తేదీని మార్చుకుంటే గనక విమానయాన కంపెనీలు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తాయనే విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా సెకెండ్ వేవ్ విపరీతంగా ఉండటంతో పలు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మే 15 వరకూ బుక్ చేసుకున్న టికెట్లపై సమయం, తేదీలను ఎన్నిసార్లు మార్చుకున్నప్పటికీ, అందుకు ఎటువంటి రుసుమును వసూలు చేయమని ఎయిర్ ఏషియా స్పష్టం చేసింది. ఇతర విమానయాన సంస్థలైన స్పైస్‌జెట్, ఇండిగోలు కూడా ఇదే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపాయి. స్పైస్‌జెట్ మాత్రం ప్రయాణం చేయడానికి 5 రోజులు ముందు వరకూ మాత్రం సమయం, తేదీని మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.

Tags:    

Similar News