వెనక సీటుకు కూడా ఎయిర్ బ్యాగ్స్!

కారు వెళ్లి చెట్టుకు గుద్దుకున్నపుడు లేదా దేనికైనా బలంగా తగిలినపుడు డ్రైవర్‌‌తో పాటు ముందు కూర్చున్న వారికి తీవ్రంగా గాయాలు తగలకుండా ఉండేందుకు గాలి సంచులు (ఎయిర్ బ్యాగ్స్) అమరుస్తారు. అయితే మరి వెనక కూర్చున్నవాళ్ల సంగతి? ఇదే ప్రశ్న మెర్సిడెస్ బెంజ్ వారికి కూడా వచ్చింది. అందుకే త్వరలో విడుదల కానున్న ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో వెనక కూర్చున్న వాళ్ల కోసం కూడా ఎయిర్ బ్యాగ్స్ అమర్చనున్నారు. ఈ సదుపాయంతో వస్తున్న కార్లలో ప్రపంచంలో ఇదే […]

Update: 2020-07-25 05:07 GMT

కారు వెళ్లి చెట్టుకు గుద్దుకున్నపుడు లేదా దేనికైనా బలంగా తగిలినపుడు డ్రైవర్‌‌తో పాటు ముందు కూర్చున్న వారికి తీవ్రంగా గాయాలు తగలకుండా ఉండేందుకు గాలి సంచులు (ఎయిర్ బ్యాగ్స్) అమరుస్తారు. అయితే మరి వెనక కూర్చున్నవాళ్ల సంగతి? ఇదే ప్రశ్న మెర్సిడెస్ బెంజ్ వారికి కూడా వచ్చింది. అందుకే త్వరలో విడుదల కానున్న ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్‌లో వెనక కూర్చున్న వాళ్ల కోసం కూడా ఎయిర్ బ్యాగ్స్ అమర్చనున్నారు. ఈ సదుపాయంతో వస్తున్న కార్లలో ప్రపంచంలో ఇదే మొదటిది. కాగా, 2021 మెర్సిడెస్ బెంజ్ – ఎస్ క్లాస్‌ను అధికారికంగా సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు.

తాము ఆవిష్కరించబోయే ఎస్-క్లాస్ సిరీస్‌లో రక్షణకు, సాంకేతికతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని గతంలో మెర్సిడెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు చైల్డ్ సీట్స్, ఆప్షనల్ బెల్ట్ బ్యాగు కూడా ఇందులో ఉన్నాయి. మెర్సిడెస్-బెంజ్ విడుదల చేసిన అధికారిక చిత్రంలో ముందు సీటుకు వెనకవైపున ఎయిర్ బ్యాగ్స్ అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే వెనక సీటు డిజైన్ కూడా అందుకు తగినట్లుగా యూ-ఆకారంలో తయారు చేసినట్లుగా కనిపిస్తోంది. దీని వల్ల ఎయిర్ బ్యాగ్స్ సరిగ్గా తెరుచుకుని ప్రయాణికుడిని కాపాడేందుకు వీలు కలుగుతుంది. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఈ ఎస్-క్లాస్ సిరీస్ కార్లలో ప్రీ-సేఫ్ ఇంపల్స్ సైడ్ ఫంక్షన్ సిస్టం కూడా ఉంది. కారుకు ఇరువైపులా ఎక్కడైనా గుద్దుకున్నపుడు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా వారిని కారు మధ్యలోకి జరిపే టెక్నాలజీ ఇది. దీని వల్ల కారు పక్కకు తిరిగినపుడు ప్రయాణికుడి సీటు మధ్యకు జరిగి గాయాలు తక్కువ తగులుతాయి.

Tags:    

Similar News