ఐన‌వోలు జాత‌ర‌ డేట్ ఫిక్స్

దిశ ప్రతినిధి, వరంగల్: ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ జాత‌ర‌కు అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను మంత్రి ఆదేశించారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే […]

Update: 2020-12-26 06:21 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ర్ట పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. ఈ జాత‌ర‌కు అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఏర్పాట్లు చేయాల‌ని ఆల‌య అధికారులు, అర్చ‌కుల‌ను మంత్రి ఆదేశించారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌త‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్ట‌లు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సీసీ కెమెరాలు, భ‌క్తుల‌కు అన్న‌దానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్ప‌న పై ఆయాశాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు.

మాస్కు ధ‌రిస్తేనే ద‌ర్శ‌నం
కోవిడ్ నేప‌థ్యంలోత‌ప్ప‌నిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రిస్తేనే దర్శనానికి అనుమతించాలని చెప్పారు. వైద్య శాఖతో పాటు, ఆరూరీ గట్టుమల్లు ట్రస్ట్ నుండి మాస్కు లు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే వీఐపీలకు, దాతలకు ప్రత్యేక పాసులు జారీ చేసి, నిర్ణీత సమయాల్లో నేరుగా దర్శనాలు చేయించాలన్నారు. భ‌క్తుల‌కు ద‌ర్శ‌నార్థం చేసే ఏర్పాట్ల‌లో కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. భ‌క్తులు కిక్కిరిసి పోకుండా, భౌతిక దూరం పాటించేలా చూడాల‌ని ఆదేశించారు. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని చెప్పారు. ఆర్టీసీ అదనంగా 25 బస్సులు నడపాలని నిర్ణయించింది. కాగా, రోడ్ల మరమ్మతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఫైర్ ఇంజన్, వైద్య సదుపాయాలు తదితర అంశాల వారీగా మంత్రి సమీక్షించారు.

Tags:    

Similar News