Black Fungus: బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?

న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్‌ను సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణంగా బ్లాక్ ఫంగస్ డయాబెటిస్ కంట్రోల్‌లో లేనివారికి, స్టెరాయిడ్‌లు ఎక్కువగా తీసుకున్నావారికి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించింది. బ్లాక్ ఫంగస్‌ను కింది లక్షణాలతో గుర్తించవచ్చు. – ముక్కు నుంచి నల్లటి ద్రవపదార్థం, రక్తం కారడం – ముక్కు దిబ్బడం, తలనొప్పి, కంటి నొప్పి – కంటి చుట్టూ […]

Update: 2021-05-20 20:10 GMT

న్యూఢిల్లీ: బ్లాక్ ఫంగస్‌ను సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడానికి ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సాధారణంగా బ్లాక్ ఫంగస్ డయాబెటిస్ కంట్రోల్‌లో లేనివారికి, స్టెరాయిడ్‌లు ఎక్కువగా తీసుకున్నావారికి, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించింది. బ్లాక్ ఫంగస్‌ను కింది లక్షణాలతో గుర్తించవచ్చు.

– ముక్కు నుంచి నల్లటి ద్రవపదార్థం, రక్తం కారడం
– ముక్కు దిబ్బడం, తలనొప్పి, కంటి నొప్పి
– కంటి చుట్టూ వాపు రావడం, రెండుగా కనిపించడం, కళ్లు ఎరుపెక్కడం, దృష్టి మందగించడం, కళ్లు మూయడం, తెరవడంలో ఇబ్బందికలగడం
– ముఖమంతా తిమ్మిరిగా ఉండటం
– నోరు తెరవడం లేదా నమలడంలో ఇబ్బందవడం
– ముక్కు, చెంపలు, కంటి చుట్టూ వాపు లేదా రంగుమారడం, ముట్టుకుంటే నొప్పి కలగడం
– పళ్లు లూజ్ కావడం
– నోటి లోపలా వాపు రావడం, నలుపురంగుకు మారడం

ఈ లక్షణాలు కనిపిస్తే..
వెంటనే ఈఎన్‌టీ డాక్టర్, కంటి వైద్యుడిని సంప్రదించాలి
వైద్యులు సూచించిన తీరు ట్రీట్ కొనసాగించుకోవాలి
బ్లడ్ షుగర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
ఇతర వ్యాధులతో బాధపడితే, వాటికీ మందులు తీసుకుంటూనే ఉండాలి
సొంత వైద్యం వద్దు
వైద్యుల సలహా మేరకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసుకోవాలి

Tags:    

Similar News