ఇండియాలో పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పాట్నా ఎయిమ్స్‌లో ఏడుగురు పిల్లలకు కొవాగ్జిన్ తొలి డోస్ ఇచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ పిల్లలపై సోమవారం కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఇందుకోసం 18 మంది చిన్నారులను ఎంపికచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పిల్లలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం మే 13న ఆమోదం […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పాట్నా ఎయిమ్స్‌లో ఏడుగురు పిల్లలకు కొవాగ్జిన్ తొలి డోస్ ఇచ్చారు. ఢిల్లీ ఎయిమ్స్‌లోనూ పిల్లలపై సోమవారం కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. ఇందుకోసం 18 మంది చిన్నారులను ఎంపికచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పిల్లలపై వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్రం మే 13న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.