‘కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి.. బయటపెట్టండి ఈటల రాజేందర్’

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ వేదికగా జరిగిన అవినీతిని బయటపెట్టీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత రాజకీయంగా ఏంచేయాలో అలోచించాలని మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్, మాజీ మంత్రి ఈటేల రాజేందర్కు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధి 30 వ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా మధు యాష్కి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతు… మాజీ మంత్రి ఈటల రాజేందర్ […]

Update: 2021-05-21 01:41 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ వేదికగా జరిగిన అవినీతిని బయటపెట్టీ, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత రాజకీయంగా ఏంచేయాలో అలోచించాలని మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్, మాజీ మంత్రి ఈటేల రాజేందర్కు సూచించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధి 30 వ వర్ధంతి వేడుకలలో ముఖ్య అతిథిగా మధు యాష్కి పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతు… మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదివికి రాజీనామా చేయ్యలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అనే విషయం తనకు తెలియదని అన్నారు. కేసీఆర్ మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఈటలకు బీసీలు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. బీసీ కాబట్టే కేసీఆర్ ఈటల పై కుట్రపన్నారన్నారు. కాంగ్రెస్ లోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. అలానే రాజకీయంగా వెనుకబడుతున్నారనే కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించారని ఎద్దేవా చేశారు . కరోనా సమయంలో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ మేలన్నారు. రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్ ద్వార కేవలం 16 వేల మందికి లబ్ధి కలుగుతుందని, అదే రాజీవ్ ఆరోగ్య శ్రీ చేర్చితే 70 వేలమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. కరోనా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ నేతలు గడుగు గంగాధర్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఇంచార్జీలు తాహేర్ బిన్ హందాన్, నగర అధ్యక్షులు కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News