'కేటీఆర్ కు డ్రగ్స్ తో లింకులు.. ఇదిగో ప్రూఫ్'

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఎవ‌డో పిచ్చోడు నాపైన ఈడీకి ఫిర్యాదు చేసిండంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్స‌న్ తీవ్రంగా మండిప‌డ్డారు. కేటీఆర్.. ఎవ‌డ్రా పిచ్చోడు..? డ్రగ్స్‌తో లింకులున్న‌ది నిజంకాదా..? అంటూ మంత్రిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. నీకు ద‌మ్ముంటే నాపై కేసులు పెట్టు.. జైల్లో పెట్టించు అంటూ స‌వాల్ విసిరారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్ కేసుతో సంబంధముందని గురువారం ఈడీ […]

Update: 2021-09-18 04:54 GMT

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఎవ‌డో పిచ్చోడు నాపైన ఈడీకి ఫిర్యాదు చేసిండంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్స‌న్ తీవ్రంగా మండిప‌డ్డారు. కేటీఆర్.. ఎవ‌డ్రా పిచ్చోడు..? డ్రగ్స్‌తో లింకులున్న‌ది నిజంకాదా..? అంటూ మంత్రిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. నీకు ద‌మ్ముంటే నాపై కేసులు పెట్టు.. జైల్లో పెట్టించు అంటూ స‌వాల్ విసిరారు. టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌కు డ్ర‌గ్స్ కేసుతో సంబంధముందని గురువారం ఈడీ అధికారుల‌కు ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్స‌న్ ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం మంత్రి కేటీఆర్ విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ఎవ‌డో పిచ్చోడు నాపైన ఈడీకి ఫిర్యాదు చేశాడంటూ వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ఏఐసీసీ నేత బ‌క్క జ‌డ్స‌న్ మీడియాకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మంత్రి కేటీఆర్‌తో పాటు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మ‌రికొంత‌మంది మంత్రుల‌పై తిట్ల‌దండ‌కంతో విరుచుకుప‌డ్డారు. నిర్ధిష్ట‌మైన ప‌లు ప్ర‌శ్న‌ల‌ను సంధించారు.

Tags:    

Similar News