అహ్మదాబాద్‌లో వారాంతంలో కర్ఫ్యూ

అహ్మదాబాద్: కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలు ఊపందుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లో ఈ వారాంతంలో కర్ఫ్యూ విధించడానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ఆదేశించింది. ఈ రెండురోజుల కర్ఫ్యూ కాలంలో ఔషధాలు, పాలు అమ్మకానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో స్థానికులు భయంతో సమీప మార్కెట్‌లలో సరుకులు, కూరగాయల కొనుగోలుకు పెద్దపెట్టున తరలివెళ్లారు. ఈ ఆందోళనల నేపథ్యంలో […]

Update: 2020-11-20 05:13 GMT

అహ్మదాబాద్: కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి చర్యలు ఊపందుకుంటున్నాయి. అహ్మదాబాద్‌లో ఈ వారాంతంలో కర్ఫ్యూ విధించడానికి నగర మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పాటించాలని ఆదేశించింది. ఈ రెండురోజుల కర్ఫ్యూ కాలంలో ఔషధాలు, పాలు అమ్మకానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో స్థానికులు భయంతో సమీప మార్కెట్‌లలో సరుకులు, కూరగాయల కొనుగోలుకు పెద్దపెట్టున తరలివెళ్లారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ స్పందించారు. వీకెండ్ కర్ఫ్యూ కేవలం అహ్మదాబాద్‌కే పరిమితమని, కరోనా కట్టడికి ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని భావించడం లేదని, దానిపై చర్చలూ లేవని స్పష్టం చేశారు.

Tags:    

Similar News