చుట్టూ పచ్చదనం.. మధ్యలో నిండుకుండలా..!

దిశ, మహబూబాబాద్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల్లోనూ నీరు భారీగా చేరుకుంది. ఇక బావుల్లో అయితే గ్రౌండ్ లెవల్లో నీటి శాతం పెరగడంతో పైకి ఉబికివస్తున్నాయి. తాజాగా ఓ వ్యవసాయ బావి పూర్తిగా నీటితో నిండుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చూసేందుకు కూడా ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టూ పచ్చదనం మధ్యలో నిండుకుండులా ఉన్న ఆ వ్యవసాయ బావిని చూసేందుకు రెండు కళ్లు […]

Update: 2021-07-27 03:52 GMT

దిశ, మహబూబాబాద్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటల్లోనూ నీరు భారీగా చేరుకుంది. ఇక బావుల్లో అయితే గ్రౌండ్ లెవల్లో నీటి శాతం పెరగడంతో పైకి ఉబికివస్తున్నాయి. తాజాగా ఓ వ్యవసాయ బావి పూర్తిగా నీటితో నిండుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చూసేందుకు కూడా ఆ దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. చుట్టూ పచ్చదనం మధ్యలో నిండుకుండులా ఉన్న ఆ వ్యవసాయ బావిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే అతిశయోక్తి కాదు.

ఈ అద్బుత దృశ్యం ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లపూసపల్లి రోడ్డులో మంగళవారం వెలుగుచూసింది. గతంతో పొల్చుకుంటే జిల్లాలోని చెరువుల్లోకి ఎస్ఆర్ఎస్పీ జలాలు విడుదల కావడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో వ్యవసాయ బావిలోకి నీరు పైకి ఉబికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ బావిలో నీరు లేక ఇబ్బంది పడ్డ రైతులు ఇప్పుడు పూర్తిగా నీటితో నిండియున్న బావిని చూసి ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News