‘చప్పట్ల’తో నడుస్తున్న వ్యవసాయ మోటార్.. ఎక్కడంటే?

దిశ, కల్వకుర్తి : విద్యుత్ బల్బు వెలగాలంటే స్విచ్ అవసరం.. అదే మోటారు నీళ్లు బయటకు కొట్టాలంటే స్టార్టర్‌‌ను ఆన్ చేయాల్సిందే.. ఇటీవల సెల్‌ఫోన్ ద్వారా ఎక్కడో ఉండి తమ చేనుకు రైతులు అవసరమైన నీటిని పారించేందుకు మోటారు స్టార్ట్ చూసి ఉంటాం. కానీ, ఓ యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. మొబైల్ ద్వారా కాకుండా ఏకంగా చప్పట్లు కొడితే వచ్చే ధ్వని వలన విద్యుత్ మోటార్ స్టార్ట్ అయ్యేలా తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఈ […]

Update: 2021-12-11 11:35 GMT

దిశ, కల్వకుర్తి : విద్యుత్ బల్బు వెలగాలంటే స్విచ్ అవసరం.. అదే మోటారు నీళ్లు బయటకు కొట్టాలంటే స్టార్టర్‌‌ను ఆన్ చేయాల్సిందే.. ఇటీవల సెల్‌ఫోన్ ద్వారా ఎక్కడో ఉండి తమ చేనుకు రైతులు అవసరమైన నీటిని పారించేందుకు మోటారు స్టార్ట్ చూసి ఉంటాం. కానీ, ఓ యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. మొబైల్ ద్వారా కాకుండా ఏకంగా చప్పట్లు కొడితే వచ్చే ధ్వని వలన విద్యుత్ మోటార్ స్టార్ట్ అయ్యేలా తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఈ విచిత్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు కొన్ని రోజుల పాటు ప్రయత్నించి చప్పట్లు కొడితే మోటర్ స్టార్ట్ అయ్యేలా.. అదే చప్పట్లు కొడితే బంద్ అయ్యేలా స్టార్టర్‌ను తయారుచేసి అమర్చాడు. చెప్పడానికి, చూడడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఆ యువకుడు స్వయంగా దగ్గరుండి మోటార్ ఆన్ చేస్తూ.. బంద్ చేస్తున్నాడు. ఇతరులు కొట్టడం ద్వారా కూడా మోటార్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. తన ఆలోచనలకు పదును పెట్టి అద్భుతాన్ని ఆవిష్కరించిన కళ్యాణ్‌ను పలువురు అభినందిస్తున్నారు.

Tags:    

Similar News