యాసంగిలో వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే ముద్దు..
దిశ, ఉప్పునుంతల: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఎం భరత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 5 నుండి 31వరకు ఉప్పునుంతల మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రత్యామ్నాయ సాగుపైన రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులు వేసిన పల్లిలో తిక్కాకు మచ్చ తెగులు నివారణ కొరకు ”టెబ్యూ కెనోజెల్ ”200 mlఎకరాకు 200లీటర్ల నీటిలోకలిపి పిచికారీ చెయ్యాలని వివరించారు. అనంతరం రైతులకు క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ […]
దిశ, ఉప్పునుంతల: యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారి ఎం భరత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 5 నుండి 31వరకు ఉప్పునుంతల మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రత్యామ్నాయ సాగుపైన రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులు వేసిన పల్లిలో తిక్కాకు మచ్చ తెగులు నివారణ కొరకు ”టెబ్యూ కెనోజెల్ ”200 mlఎకరాకు 200లీటర్ల నీటిలోకలిపి పిచికారీ చెయ్యాలని వివరించారు.
అనంతరం రైతులకు క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సర్పంచ్ కృష్ణయ్య, రైతు బంధు సభ్యులు గణేష్, జానకి రాం రెడ్డి, రమేష్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, లక్ష్మయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.