భూముల ధరలకు రెక్కలు.. సామాన్యుడికి అందేదెలా..?
దిశ, దౌల్తాబాద్: ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండల పరిసరాల్లో వ్యవసాయ భుములకు రెక్కలు వచ్ఛాయి. మండలాలు రాకముందు భూములకు విలువ లేకుండాపోయింది. ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో వ్యవసాయ భూములకు అమాంతం విలువ పెరిగింది.. ఒకప్పుడు రాయపోల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ధ గజం భూమి 2 వేలు ఉండేది. మండలం ఏర్పడిన తరువాత ఏకంగా గజం భూమి విలువ 15 వేలకు పెరిగింది. వ్యవసాయ భూముల రోడ్డు ప్రక్కన ఉన్న భూములకు సైతం 10 […]
దిశ, దౌల్తాబాద్: ఉమ్మడి దౌల్తాబాద్, రాయపోల్ మండల పరిసరాల్లో వ్యవసాయ భుములకు రెక్కలు వచ్ఛాయి. మండలాలు రాకముందు భూములకు విలువ లేకుండాపోయింది. ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో వ్యవసాయ భూములకు అమాంతం విలువ పెరిగింది.. ఒకప్పుడు రాయపోల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ధ గజం భూమి 2 వేలు ఉండేది. మండలం ఏర్పడిన తరువాత ఏకంగా గజం భూమి విలువ 15 వేలకు పెరిగింది. వ్యవసాయ భూముల రోడ్డు ప్రక్కన ఉన్న భూములకు సైతం 10 లక్షలు నుండి 20 లక్షలు ఉండేది. కానీ, పరిస్థితిలు పూర్తిగా మారాయి. రోడ్డు ప్రక్కన ఎకరాకు రూ.80 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు పెరిగింది. దీంతో రియల్ వ్యాపారులు మొత్తం రాయపోల్ మండల పరిసరాలపై కన్ను వేశారు. అటు రియాల్ వ్యాపారులకు సైతం రాజకీయ నాయకుల అండదండలతో పాటు పోలీసులు హస్తం కూడా ఉండడంతో జోరుగా రియల్ ఎస్టేట్ సాగుతోంది. ప్రతి రోజు రాయపోల్ తహశీల్దార్ కార్యాలయం ముందు రిజిస్ట్రేషన్ ల జాతర కోనసాగుతుంది. రెవెన్యూ అధికారులు కూడా ఇదేమి పట్టనట్టు మీసేవలో స్లాట్ బుక్ చేసిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులు అందినకాడికి మామూలు తీసుకుంటున్నట్లు రైతులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. అటు దౌల్తాబాద్ మండలంలో సైతం ఒకప్పుడు నామమాత్రం ధరలు ఉండేవి.. గతంలో మండల కేంద్రంలో గజం భూమికి 4వేలు ఉండేది. కాని ప్రస్తుతం గజం భూమి ఏకంగా 25 వేలు పలుకుతుంది. అయినా దౌల్తాబాద్ మండల కేంద్రంలో భూమి దొరకడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. దౌల్తాబాద్ పరిసరాల్లో సైతం వ్యవసాయ భూములకు మంచి ధరలు పలుకుతున్నాయి. ఎకరం భూమి రోడ్డుకు కావాలంటే 60 నుంచి 70 లక్షలు వరకు రేటు పెరిగింది. ఈ మండలంలో కుడా రియాల్ వ్యాపారులకు తోడు రాజకీయ నాయకులు, పోలీసులు తోడు కావడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. రెండు మండలాల్లో వ్యవసాయ ప్లాట్ల భూములకు విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు భూములు కొనలేని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా మండలాలు ఏర్పడడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కాగా, హైదరాబాద్ నుంచి కేవలం గంట సేపులోనే రెండు మండలాలకు అక్కడి వ్యాపారులు రావడంతో పాటు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ కు అతి దగ్గరలో రెండు మండలాలు ఉండడంతో భూముల ధరలు ఆకాశానంటాయి.