200 కిలోమీటర్ల దూరం నుంచి కనిపిస్తున్న హిమాలయాలు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా మానవాళికి తీరని నష్టాన్ని చేకూర్చింది. కానీ, ప్రకృతికి మాత్రం ఎంతో మేలు చేసింది. దశాబ్దాలుగా మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్న కాలుష్యాన్ని తగ్గించి పరోక్షంగా మనకు మేలు చేసింది. దశాబ్దాలకు పరిష్కారం కానీ గంగా జలం.. కేవలం రెండు నెలల్లోనే స్వచ్ఛంగా మారిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా కానరాని పక్షులు మళ్లీ కనిపిస్తున్నాయి. మనుషుల కనపడకపోవడంతో.. జంతువులు కూడా స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. భారత్ లోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత చాలా పెరిగింది. […]
దిశ, వెబ్ డెస్క్ :
కరోనా మానవాళికి తీరని నష్టాన్ని చేకూర్చింది. కానీ, ప్రకృతికి మాత్రం ఎంతో మేలు చేసింది. దశాబ్దాలుగా మానవాళిని ఆందోళనకు గురిచేస్తున్న కాలుష్యాన్ని తగ్గించి పరోక్షంగా మనకు మేలు చేసింది. దశాబ్దాలకు పరిష్కారం కానీ గంగా జలం.. కేవలం రెండు నెలల్లోనే స్వచ్ఛంగా మారిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా కానరాని పక్షులు మళ్లీ కనిపిస్తున్నాయి. మనుషుల కనపడకపోవడంతో.. జంతువులు కూడా స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. భారత్ లోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత చాలా పెరిగింది. ముక్కు మూసుకున్న దేశ రాజధాని ప్రజలు హాయిగా ఊపిరి తీసుకోవచ్చు. ఆఖరకు హుస్సేన్ సాగర్ నీటి నాణ్యత కూడా పెరిగింది. ఇలా ఎన్నో అసాధ్యాలు కరోనా వల్ల సాధ్యమయ్యాయి. అలానే ఇటీవలే పంజాబ్ లోని జలంధర్ సిటీ ప్రజలు.. 160 కిలోమీటర్ల దూరం నుంచే దౌలాదర్ హిమాలయ పర్వతాలను చూసి మురిసిపోయారు. తాము పుట్టినప్పటి నుంచి ఆ పర్వతాలను చూసి ఎరగమని జలంధర్ వాసులు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ సిటీవాసులు కూడా ఇదే రకమైన అనుభూతిని ఆస్వాదించారు. అక్కడి నుంచి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న గంగోత్రి, బద్రాపంచ్ పర్వాతాలు చూడగలిగారు. ఇప్పుడు బిహార్ వాసుల వంతు వచ్చింది.
బిహార్ లోని సీతామర్హి జిల్లాలో సింగ్‌వాహిని అనే గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం ఆ ఊరి నుంచి చూస్తే ఎవరెస్ట్ శిఖరం కనిపించేది. కానీ, గాలి కాలుష్యం పెరగడంతో ఆ హిమాలయాలు కనిపించకుండా పోయాయి. కరోనా వల్ల గాలి కాలుష్యం తగ్గడంతో.. ఆ గ్రామ ప్రజలు ఊహించని విధంగా సింగ్ వాహిని గ్రామస్తులు సృష్టంగా ఎవరెస్ట్ పర్వతాన్ని చూడగల్గుతున్నారు. రీతూ జైస్వాల్ అనే నెటిజన్ తమ టెర్రస్ మీద నుంచి హిమాలయాలు కనిపిస్తున్న ఫొటో తీసింది. మంచు తెరలు, చెట్లతో అద్భుతమైన ఎవరెస్ట్ శిఖరం అందులో కనిపిస్తోంది. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ రీతూ ఫొటోను షేర్ చేస్తూ.. బిహార్ వాసులకు హిమాలయాలు కనపడుతున్నాయని క్యాప్షన్ రాశారు. సింగ్ వాహిని గ్రామ ప్రజలు మాత్రం ఎవరెస్ట్ ను చూసి తెగ ఆనందపడుతున్నారు.
Tags: Saharanpur, himalayas, bihar, sitamarhi village