కోక్ వద్దన్న రొనాల్డో.. బీర్‌ను పక్కన బెట్టిన పోబా
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2021 ప్రెస్ మీట్‌లో క్రిస్టియానో రొనాల్డో కోక్ బాటిల్స్‌ను పక్కన పెట్టిన ఉదంతం చర్చల్లో ఉండగానే అలాంటిదే మరో సంఘటన జరిగింది. జర్మనీపై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించిన అనంతరం మీడియా ముందుకు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ పాల్ పోబా వెళ్లాడు. ఆ సమయంలో టేబుల్‌పై హెనకిన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. పాల్ […]
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2021 ప్రెస్ మీట్‌లో క్రిస్టియానో రొనాల్డో కోక్ బాటిల్స్‌ను పక్కన పెట్టిన ఉదంతం చర్చల్లో ఉండగానే అలాంటిదే మరో సంఘటన జరిగింది. జర్మనీపై ఫ్రాన్స్ జట్టు విజయం సాధించిన అనంతరం మీడియా ముందుకు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్ పాల్ పోబా వెళ్లాడు. ఆ సమయంలో టేబుల్‌పై హెనకిన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. పాల్ పోబా ముస్లిం మతానికి చెందిన వ్యక్తి,. వారి మతాచారం ప్రకారం బీర్, ఆల్కహాల్ పానియాలు సేవించడం, ప్రచారం చేయడం పాపంగా భావిస్తారు. అందుకే పాల్ పోబా ఆ బాటిల్‌ను పక్కు పెట్టాడని సన్నిహితులు చెప్పారు. కాగా, క్రిస్టియానో రొనాల్డో చేసిన పని కారణంగా కోకా కోలా కంపెనీ మార్కెట్ వాల్యూ 1.6 శాతం పడిపోయింది. దాదాపు రూ. 29 వేల కోట్లు (4 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లింది. రొనాల్డో ఉదంతంపై స్పందించిన కోకాకోలా.. ‘ఎవరికి నచ్చిన డ్రింక్ వాళ్లు తాగే హక్కు ఉంటుంది’ అని ప్రకటన విడుదల చేసి నష్టనివారణకు చర్యలు తీసుకున్నది.