కరోనా.. డాక్టర్‌ను ఎవరైనా నిర్బంధిస్తారా?

న్యూఢిల్లీ : కరోనాతో దేశంలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఆ మహమ్మారితో ముందుండి పోరాడుతున్న క్రమంలో వైరస్ సోకిన వైద్యులపట్లా కొందరు మానవతా దృక్పథంతో సానుకూలంగా మెలగడం లేదు. అమానుషంగా ప్రవర్తిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ఏరియాలో చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు.. పేషెంట్‌లకు చికిత్స అందిస్తున్న క్రమంలో కరోనా వైరస్ బారిన పడింది. అయితే, ఆ ఆసుపత్రిలోనే వైద్య సాయం తీసుకున్న ఆమె.. రెండు సార్లు కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చిన […]

Update: 2020-05-16 05:25 GMT

న్యూఢిల్లీ : కరోనాతో దేశంలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఆ మహమ్మారితో ముందుండి పోరాడుతున్న క్రమంలో వైరస్ సోకిన వైద్యులపట్లా కొందరు మానవతా దృక్పథంతో సానుకూలంగా మెలగడం లేదు. అమానుషంగా ప్రవర్తిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ఏరియాలో చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు.. పేషెంట్‌లకు చికిత్స అందిస్తున్న క్రమంలో కరోనా వైరస్ బారిన పడింది. అయితే, ఆ ఆసుపత్రిలోనే వైద్య సాయం తీసుకున్న ఆమె.. రెండు సార్లు కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చిన తర్వాత హోం క్వారంటైన్ కోసం వసంత్‌కుంజ్ ఏరియాలో ఒంటరిగా ఉంటున్న తన ఫ్లాట్‌కు చేరారు. ఆమె తన ఫ్లాట్‌కు చేరగానే.. కరోనా పాజిటివ్ పేషెంట్ వచ్చారని.. ఇరుగుపొరుగు వారు ఆమెపై దుర్భాషలాడారు. ముఖ్యంగా మనీష్ అనే వ్యక్తి.. ఆ డాక్టర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అనంతరం తనను ఇంటిలో బంధించినట్టు సదరు డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన అవమానంపై డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News