‘ఇవాళ శుక్రవారం.. ద్రావిడ్‌ను అవుటిస్తే వెళ్లి ఎంజాయ్ చేస్తాం’

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకునే షోయబ్ అక్తర్ తను క్రికెట్ ఆడేకాలంలో మైదానంలో చాలా ఉద్రేకంగా ఉండేవాడు. ఇక అది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే అతడిలో ఉత్సాహం కట్టలు తెచ్చుకునేది. 1999లో బెంగళూరులో జరిగిన ఒక మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి టీం ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ పంచుకున్నాడు. ‘ఆ మ్యాచ్‌లో సచిన్ ఆడట్లేదు. దీంతో వికెట్లు త్వరగా తీయాలని కెప్టెన్ […]

Update: 2020-08-08 07:51 GMT

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలుచుకునే షోయబ్ అక్తర్ తను క్రికెట్ ఆడేకాలంలో మైదానంలో చాలా ఉద్రేకంగా ఉండేవాడు. ఇక అది ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే అతడిలో ఉత్సాహం కట్టలు తెచ్చుకునేది. 1999లో బెంగళూరులో జరిగిన ఒక మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికరమైన ఘటన గురించి టీం ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో అక్తర్ పంచుకున్నాడు.

‘ఆ మ్యాచ్‌లో సచిన్ ఆడట్లేదు. దీంతో వికెట్లు త్వరగా తీయాలని కెప్టెన్ అఫ్రీది, నేను అనుకున్నాం. మా ప్రణాళిక ప్రకారమే 4వికెట్లను త్వరగా తీశాం. కానీ రాహుల్ ద్రావిడ్ మాత్రం క్రీజును వదలట్లేదు. అతడిని ఎలాగైనా అవుట్ చేయాలని అఫ్రీది పదే పదే నన్ను కోరాడు. నేను కూడా ద్రావిడ్ బ్యాట్‌కు ప్యాడ్‌కు మధ్య బంతిని వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాను.

ఒకసారి బంతి ప్యాడ్‌కు తగిలింది. దీంతో అవుట్ కోసం అప్పీల్ చేశా. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో, ఇవాళ శుక్రవారం.. ద్రావిడ్‌ను అవుటిస్తే మేం వెళ్లి ఎంజాయ్ చేయాలన్నాను. కానీ అంపైర్ నా మాటలు పట్టించుకోలేదు’ అని అక్తర్ చెప్పాడు. అంపైర్ అవుటివ్వక పోయినా ఆ మ్యాచ్‌లో తాము 123 పరుగుల తేడాతో గెలిచాము. అయితే ద్రావిడ్ లాంటి బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని, అతడు అంకిత భావంతో ఆడతాడని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News