కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కు అఫ్గాన్ క్రికెటర్లు దూరం
దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఈ నెల 18నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ట్రినిడాల్, టొబాగోలో ఉన్న రెండు స్టేడియాల్లో బయోసెక్యూర్ వాతావరణంలో సీపీఎల్ నిర్వహించనున్నారు. కాగా, ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెటర్ల దూరమవుతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు సీపీఎల్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తున్నది. ఖైస్ అహ్మద్, రహమనుల్లా గుర్బాజ్, నూర్ అహ్మద్‌లకు వీసా ఆటంకాలు ఏర్పడటంతో లీగ్ ఆడలేకపోతున్నారు. లండన్ నుంచి వెస్టిండీస్‌కు […]
దిశ, స్పోర్ట్స్: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఈ నెల 18నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ట్రినిడాల్, టొబాగోలో ఉన్న రెండు స్టేడియాల్లో బయోసెక్యూర్ వాతావరణంలో సీపీఎల్ నిర్వహించనున్నారు. కాగా, ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెటర్ల దూరమవుతున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆఫ్గనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు సీపీఎల్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తున్నది. ఖైస్ అహ్మద్, రహమనుల్లా గుర్బాజ్, నూర్ అహ్మద్‌లకు వీసా ఆటంకాలు ఏర్పడటంతో లీగ్ ఆడలేకపోతున్నారు. లండన్ నుంచి వెస్టిండీస్‌కు ప్రత్యేక చార్టెడ్ విమానాలు ఎక్కడానికి అవసరైన ట్రాన్సిట్ వీసాలు లేకపోవడంతో వీళ్లు సీపీఎల్ ఆడే అవకాశం కోల్పోనున్నారు. లీగ్‌లో ఆడే ఆటగాళ్లు 14 రోజుల పాటు ట్రినిడాడ్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ శిబిరంలో గడపాలి. కానీ, వీసాలు దొరకక పోవడంతో ఈ ముగ్గురు అక్కడకు చేరుకోలేదు. సీపీఎల్ 2020కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు నడపడానికి కొన్ని తేదీలు మాత్రమే ఇచ్చినందున, ఎక్కువ సమయం దొరకలేదని సీపీఎల్ ప్రతినిధి ఒకరు క్రిక్‌బజ్‌తో అన్నారు.